సాక్షి, హైదరాబాద్: ఈ చలికాలంలో పొగ మంచు ముప్పు పొంచి ఉంటోంది. దట్టమైన పొగమంచు ఎదుటి వాహనాలను కానరాకుండా చేసి వాహనదారులను కాటికి పంపుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము సమయంలో పొగ మంచు తీవ్రంగా కురియడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో వీలైనంత వరకు తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
పొగ మంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు
♦ ఈనెల 5న(శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుద్బుల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కుతాడి కుమార్, ప్రదీప్ బైక్‌పై వస్తుండగా పాపయ్యగూడ చౌరస్తా వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు మసకబారడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
♦ 25 డిసెంబర్, 2023న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏండ్ల యువకుడు రమావత్ శివనాయక్ ద్విచక్రవాహనంతో 55 ఏండ్ల బల్లూరి సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడు శివ నాయక్ బంధువులు టాటాఏస్ వాహనంలో ప్ర మాద ఘటన స్థలానికి బయలుదేరారు. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో వారు ప్ర యాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ నిడమనూరు మండలం 3వ నంబర్ కెనాల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ వరుస ప్ర మాదాలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.
♦ డిసెంబర్ 31న తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ చనిపోగా, ఆర్టీసీ బస్ డ్రైవర్‌తోపాటు ఆ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు.
♦ డిసెంబర్ 25న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి ఔటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న మిత్రుల బృందం కారు పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న శివారెడ్డిపేట్ చెరువులోకి దూ సుకెళ్లింది. కారులో ఉన్న ఒకరు గల్లంతు కాగా, మిగిలిన నలుగురిని స్థానికులు కాపాడారు.
ప్రయాణం తప్పనిసరైతే ఇవి మరవొద్దు
♦ పొగమంచు కురుస్తున్నప్పుడు మీకు కేటాయించిన లేన్‌లోనే వాహనం నడపాలి. వీలైనంత వరకు ఓవర్‌టేక్ చేయకపోవడమే ఉత్తమం.
♦ సింగిల్ రోడ్డులో వాహనం నడపాల్సి వస్తే.. వీలైనంత వరకు మీ వాహనం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి.
♦ డ్రైవింగ్ సమయంలో ఏ సంశయం ఉన్నా..రోడ్డు పూర్తిగా కనిపించకపోయినా మీ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపడమే ఉత్తమం. మీరు వాహనాన్ని పార్క్ చేసినట్టుగా సూచిస్తూ పార్కింగ్ లైట్లు వేయాలి.
♦ పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు వాహన వేగాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎదుటి వాహనం కనిపించని పరిస్థితుల్లో వేగంగా వెళితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదేవిధంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.
♦ పొగమంచు కురుస్తున్నప్పడు డ్రైవర్లు సాధారణంగా హైబీంలో లైట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల రిప్లెక్షన్ వల్ల డ్రైవర్‌కు సరిగా కనిపించదు. విజిబిలిటి 100 మీటర్లలోపు ఉన్నట్లయితే హెడ్‌లైట్లు లోబీంలో ఉంచాలి. మీ వాహనానికి ఫాగ్ ల్యాంప్‌లు ఉంటే వాటిని తప్పక ఆన్ చేయాలి. ఎదుటి వాహనదారుడిని అప్రమత్తం చేసేలా మీ వాహనానికి ఇండికేటర్లు వేసు కుని వెళ్లడం ఉత్తమం. మీ వాహన అద్దాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ కారులోని డీఫాగర్‌ను ఆన్ చేసుకోవాలి.
♦ వీలైనంత వరకు ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరం మేరకు డ్రైవింగ్ సీట్‌ను సర్దుబాటు చేసుకోవాలి.
♦ పొగమంచు ఉన్నప్పుడు వాహనం ఒక్క క్షణం అదుపు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి.
♦ వాహనం పూర్తి కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలి. టైర్లు, బ్రేక్‌లు ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ కారులోని హీటర్ ఆన్ చేయాలి. దీనివల్ల బయటి పొగమంచుతో అద్దంపై ప్రభావం లేకుండా ఉంటుంది.
♦ లేన్ మారుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద తప్పకుండా హారన్ మోగించాలి.
♦ మొబైల్ ఫోన్ వాడడం, రేడియోలో ఎఫ్‌ఎం వినడం, పాటలు వింటూ డ్రైవింగ్ చేయవద్దు.
పొద్దుపొద్దునే ప్రయాణాలొద్దు!
Published Sun, Jan 7 2024 4:46 AM | Last Updated on Sun, Jan 7 2024 4:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment