Telangana Crime News: ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్న వాహనాలు.. పొగమంచుతో ప్రమాదం
Sakshi News home page

ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్న వాహనాలు.. పొగమంచుతో ప్రమాదం

Published Sat, Dec 30 2023 12:22 AM | Last Updated on Sat, Dec 30 2023 9:58 AM

- - Sakshi

ప్రమాదానికి గురైన వాహనాలు

బాలానగర్‌: పొగమంచు కారణంగా ఓ లారీని డీసీఎం, డీసీఎంను కారు.. ఇలా ఐదు వాహనాలు ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్న ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో చోటుచేసుకుంది.

ఎస్‌ఐ శ్రీనివాస్‌ వివరాల మేరకు.. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉదయం 9:30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా హైదరాబాద్‌వైపు వెళ్తున్న లారీని గమనించని ఓ డీసీఎం డ్రైవర్‌ ఢీకొట్టి, రోడ్డుపైనే వాహనం నిలిపివేశాడు. ఈ క్రమంలో వెనుకాలే వస్తున్న మరో కారు డీసీఎంను ఢీకొట్టింది.

ఇలా మరో మూడు కార్లు ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో మూడు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు యజమాని బంటుసింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement