ఎర్రకాళ్ల కొంగలు
సూళ్లూరుపేట: విదేశీ వలస విహంగాల సందడితో.. ప్రకృతి అందాలకు హరివిల్లుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మరింత శోభను సంతరించుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసే విదేశీ వలస పక్షులు నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళుతుంటాయి.
అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్‌గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్‌గా ఉపయోగించుకుని వెళుతుంటాయి. సంతానోత్పత్తి నేలపట్టులో, ఆహారం కోసం పులికాట్ సరస్సులో ఉంటూ.. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డుకు పక్కన వలస విహంగాలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ సారి సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు, ఫెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఇతర కొంగజాతులు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment