చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.
చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే.
అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం.
ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌ను ఎక్కువగా చూస్తున్నారు.
ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చు
పిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలు
చర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.
΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.
ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో...
ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ.
రెండు నుంచి
ఆరేళ్ల పిల్లల్లో...
ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు.
నివారణ / మేనేజ్‌మెంట్ అండ్ చికిత్స
స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలి
స్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్‌తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి
కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది
ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు
దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్‌తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి
సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment