సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు.
ఈ రోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’)
హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద
- వర్షాలతో 513.64 మీటర్లకు చేరిన నీటిమట్టం
- 24 గంటల పాటు వరద పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు
- నగరంలో నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు
- క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ
Comments
Please login to add a commentAdd a comment