Cyclone Mandous Andhra Pradesh LIVE Updates
ప్రకాశం జిల్లా: సముద్ర తీరంలో టెన్షన్
సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం, పల్లెపాలెం సముద్ర తీరంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం బయటకురాలేక లోపల చిక్కుకుపోవడంతో ఆందోళన కొనసాగుతుంది. బంధువులతో పాటు పోలీస్, మెరైన్ సిబ్బంది తీరం వద్ద మోహరించారు. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో మత్స్యకారుల బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులతో పోలీసులు ఫోన్‌లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. మత్స్యకారులు కూడా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నామని తెలిపారు. ఇంజన్‌లో ఆయిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఇరుక్కుపోయామని మత్స్యకారులు పోలీసులకు తెలిపారు.
గత నాలుగో తేదీన చీరాల మండలం ఓడరేవు నుంచి మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లినట్లు, తుపానులో బయటకురాలేక చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మాండూస్ తుపాన్‌పై ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్
► మాండూస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా.. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యటించాలని సీఎస్ ఆదేశించారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు పర్యటించాలని తెలిపారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
► తిరుపతిలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను సీఎస్ ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవోప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు.
► రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బిఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సీఎస్‌కు వివరించారు.
► ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
► కాగా గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది.
► మాండూస్ తుపాను బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడుతోంది.
► తుపాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
► తిరుపతిలో నీటమునిగిన కాలనీలను ఎమ్మెల్యే భూమన పరిశీలించారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు.
తిరుపతిలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్...మోకాళ్ళలోతు వరద నీటిలో వెళ్లి వరద బాధితులను పరామర్శించిన భూమన...👏👏👍 pic.twitter.com/IYmiYGTHw4
— Radhika Reddy...😍 (@sweety_00099) December 10, 2022
తిరుమల:
► మాండూస్ తుపాను ప్రభావంతో.. తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షం కారణంగా పాపవినాశనం, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయం, ఆకాశ గంగా, శ్రీవారి పాదాలకు వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో.. ద్విచక్ర వాహనదారులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ.
నెల్లూరు జిల్లా
► కోవ్వూరు నియోజవర్గంలో మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖపట్నం
► బలహీన పడుతున్న మాండూస్ తుపాను. తీవ్ర వాయు గుండంగా మారి మరింత బలహీనపడే దిశగా కదులుతోంది.
తూర్పుగోదావరి
► మాండూస్ తుఫాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేశారు అధికారులు. జిల్లాలో ఇప్పటివరకు 30 వేల 126 మంది రైతుల నుంచి లక్షా 46 వేల 417 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు జాగ్రత్త లు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు.
సాక్షి, అమరావతి: పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది మాండూస్ తుపాను. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండు రోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గేవరకూ వేటకు వెళ్లోద్దని మత్యకారులకు అధికారుల సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది.
నెల్లూరు జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్ 1077
మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈదురు గాలులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. ఘాట్ రొడ్డులో వాహన దారులను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది. వర్షంలోనే తడిచి ముద్దవుతున్నారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు గదులకే పరిమితం అయ్యారు. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, పద్మావతి పురం, లీలమహల్, వెస్ట్ చర్చి, మహిళా యూనివర్సిటీ , కృష్ణ నగర్ లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి.
🌀తీరం దాటిన మాండూస్ తుఫాన్
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 10, 2022
🌀రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్
🌀సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం
🌀ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి,చిత్తూరు,అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు pic.twitter.com/wsEOyoxgkl
అలాగే.. రాయలసీమలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్‌ఆర్‌లో వర్షాలు.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
మాండుస్ తుఫాన్ ప్రభావంతో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షo.. అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, పులివెందులలో వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మాండూస్ తుపాను ఎఫెక్ట్‌తో తుపాను, భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాను దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాపాగ్ని నది తీరం వైపు వెళ్లకుండా ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు.
► జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూం నెంబర్:08568-246344,
► కడప రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 08562-295990
► జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 9440767485
► బద్వేల్ రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 91812160052
► పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూం: 7396167368
విజయనగరం
మాండూస్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరు జల్లులు తో పెరిగిన చలి తీవ్రత.
శ్రీకాకుళం
జిల్లా లో పలుచోట్ల గడిచిన రాత్రి నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది.
విద్యుత్ స్తంభాలు కూలినా, లైన్లు తెగినా.. టోల్ ఫ్రీ నెంబర్ 1912
Comments
Please login to add a commentAdd a comment