ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవుల ప్రాంతాలకు పూర్తిగా, కేరళలో చాలా ప్రాంతాలకు, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, రామగుండంల్లో 43, హన్మకొండ, మెదక్, నిజామాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, భద్రాచలంలో 36, మహబూబ్‌నగర్‌లో 38, హైదరాబాద్‌లో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment