TS/AP: మరో రెండు రోజులు వర్షాలు | Telugu States Weather: Untimely Rains Hailstorm Two More Days | Sakshi
Sakshi News home page

TS/AP: ఉరుములు మెరుపులతో. మరో రెండు రోజులు వర్షాలు

Published Mon, Mar 27 2023 8:26 AM | Last Updated on Mon, Mar 27 2023 8:32 AM

Telugu States Weather: Untimely Rains Hailstorm Two More Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఉండగా, తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. 

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ, రేపు(సోమ, మంగళవారాల్లో) ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఏపీ తో పాటు యానాం  మీదుగా కొనసాగుతోంది అల్పపీడనం. దీంతో.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదంటే వడగంట్ల వాన కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలుగురాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement