విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం  | Rain likely in Coastal Andhra Pradesh, Rayalseema: IMD | Sakshi
Sakshi News home page

ఎస్‌కోటలో 6 సెంటిమీటర్ల వర్షపాతం 

Published Mon, May 11 2020 9:02 AM | Last Updated on Mon, May 11 2020 9:02 AM

Rain likely in Coastal Andhra Pradesh, Rayalseema: IMD - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని సుమత్రా దీవుల తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని సుమత్రా దీవుల తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని అండమాన్‌ సముద్రంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవలే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అది బలహీనపడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. (విశాఖలో కోలుకుంటున్న ఐదు గ్రామాలు)

మరోవైపు దక్షిణ తమిళనాడు నుంచి కోస్తా వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఎస్‌కోటలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 3, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. (చదవండి: గండం నుంచి గట్టెక్కినట్లే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement