
పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది.
పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.