
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాఖాతంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని దగ్గరలో ఉన్న శ్రీలంక ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చదవండి: పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్..