ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని సోమవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ ప్రభావం వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాలు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు వరద ప్రవాహంతో పోటెత్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటికి దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. (చదవండి: తీర గ్రామాలను చుట్టుముట్టిన వరద)
Comments
Please login to add a commentAdd a comment