అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం గొర్రెల సంత జీవాలతో కిటకిటలాడింది. శ్రావణ మా సం, వినాయకచవితి వేడుకలు ముగిశాయి. అ లాగే వచ్చే వారంలో బక్రీదు, మహాలయ పౌ ర్ణమి లాంటి పర్వదినాల నేపథ్యంలో మాం సానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. భారీ సంఖ్యలో మేకలు, పొట్టేళ్లను విక్రయించేందుకు తీసుకురావడంతో మార్కెట్ యార్డు ప్రాం తంలో కిక్కిరిసింది. దీంతో అక్కడి రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.