
మూగజీవాల మృత్యువాత
గసి బొరుగులు (మరమరాల తయారీలోని వ్యర్థాలు) తిని 450 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.22.50 లక్షల నష్టం వాటిల్లింది.
గసి బొరుగులు తిని 450గొర్రెలు మృతి, రూ.22.50 లక్షల నష్టం
సాక్షి, అనంతపురం: గసి బొరుగులు (మరమరాల తయారీలోని వ్యర్థాలు) తిని 450 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.22.50 లక్షల నష్టం వాటిల్లింది. సోమవారం అనంతపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్రం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు పెద్ద కొండన్న, చిన్న కొండన్న, రామాంజనేయులుకు 600 గొర్రెలున్నాయి. స్వగ్రామంలో మేత లేకపోవడంతో గొర్రెలను అనంతపురానికి తోలుకొచ్చారు.
ఆదివారం రోడ్డు పక్కన పడేసిన గసి బొరుగులను తిన్న గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. అధిక మోతాదులో గసిని తినడంవల్ల గ్యాస్ అధికంగా తయారై గొర్రెలు మృత్యువాతపడినట్లు పశువైద్యులు గుర్తించారు.