ఆంత్రాక్స్‌తో 57 గొర్రెలు మృతి
కేపీతండా (చాగలమర్రి): మండలంలోని కేపీ తండాలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి 57 గొర్రెలు మృతి చెందాయి. పొలాల్లో మేత కోసం వెళ్లి రక్తం కక్కి ఇవి మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా గ్రామానికి చెందిన రాందాస్‌నాయక్, కృష్ణానాయక్, గోవిందు నాయక్, హనుమాన్ నాయక్, తిరుపతి నాయక్‌ల తోపాటు మరికొందరి గొర్రెలు నోరు, ముక్కు నుంచి రక్తం కక్కుతూ మృతి చెందాయని రైతులు తెలిపారు. ఈ విషయంపై మండల పశువైధ్యాది కారి పుల్లయ్య మాట్లాడుతూ..విషపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చాన్నారు. కుళ్లిన, బూజు పట్టిన పశుగ్రాసాలు తినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.