మానవపాడు, న్యూస్‌లైన్: గొర్రెలు వింతరోగాలతో విలవిల్లాడుతున్నాయి. పడుకున్న చోటే పడుకున్న ట్లు మృత్యువాతపడుతున్నాయి. గత రెం డురోజుల్లోనే 323 గొర్రెలు మృతిచెం దా యి. తాజాగా శనివారం గట్టు మం డలం మాచర్ల గ్రామంలో 100 గొర్రెలు చనిపోయాయి. మండలంలోని బోరవెల్లి గ్రా మంలో 30 మంది కాపరులు గోత కో సం గొర్రెల మందను పొలానికి తీసుకెళ్లా రు.
ఉన్నట్టుండి ఒక్కొక్కటిగా కుప్పకూలి పోయాయి. ఈ విషయాన్ని స్థానిక పశుసంవర్ధకశాఖ అధికారులకు చెప్పినా ప ట్టించుకోలేదు. వైద్యం అందకపోవడం తో అవే గొర్రెలు మరణించాయి. నీలినాలుక, గాలికుంటు వ్యాధితోనే సుమారు రెండొందల గొర్రెలు చనిపోయినట్లు పశువైద్యాధికారి శంకరయ్య తెలిపారు. గత వారంరోజులుగా కురిసిన వర్షాలకు ఇ లాంటి రోగాలు దోమల నుంచి ప్రబలుతాయని, ఒక గొర్రెకు వచ్చిన రెండుగంటల కాల వ్యవధిలోనే మరో గొర్రెకు వ్యా ప్తిచెందే అవకాశం ఉందని తెలిపారు.
బో రవెల్లి గ్రామంలో రాజుకు 200 గొర్రెలు ఉండగా, అందులో 42 గొర్రెలు చనిపోయాయి. శ్రీను అనే కాపరికి ఉన్న 65 గొ ర్రెల్లో 16, పెద్దవెంకటన్నకు 150 గొర్రెలు ఉండగా, అందులో 26, బిచ్చన్నకు చెం దిన 160 గొర్రెల్లో 20, భాగ్యమ్మ చెందిన 125 గొర్రెల్లో 13, లక్ష్మీదేవి 200 గొర్రెలకు 30, రాముడు 120 గొర్రెల్లో 18, ఊ రుకుందా గొర్రెల మందలో 35, నడిపి మనెన్న మందలో 22, చిన్న గంగన్న మందలో 12, పరమేష్ మందలో 8 గొర్రెలకు చనిపోయాయి. దాదాపు 3300 గొర్రెల్లో సుమారు 230 గొర్రె లు చనిపోయాయి. మరో 250 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి.
గట్టు మండలంలో..
గట్టు : వింతరోగాల తో మూగజీవాలు వి లవిల్లాడుతున్నాయి. అంతుచిక్కని వ్యా ధితో మండలంలోని మాచర్ల గ్రామంలో శనివారం ఒకేరోజు 100 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో యజమానుల తీ వ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాని కి చెందిన కుర్వ దేవప్పకు చెందిన 30, కు ర్వ చిన్న నర్సప్పకు చెందిన 20, కుర్వ తి మ్మప్పకు చెందిన 15, కుర్వ భీమన్నకు చెందిన 10, కుర్వ వీరన్నకు చెందిన 20, కుర్వ నడిపి నర్సప్పకు చెందిన మరో 20 గొర్రెలను ఎప్పటిలాగే మేతకు తీసుకెళ్లా రు. శుక్రవారం రాత్రి దొడ్డిలో గొర్రెలు ఉ న్నవి ఉన్నట్టుగానే కనుమూశాయి. దీం తో తాము తీవ్రంగా నష్టపోయినట్లు బా ధితులు వాపోయారు. పశుసంవర్ధకశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేసి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
నెలరోజుల్లో 20వేలకు పైగా..
మహబూబ్‌నగర్ వ్యవసాయం: గిట్టుపుం డు, నీలినాలుక వ్యాధులతో నెలరోజుల్లో నే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20వేలకు పైగా గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వి స్తారంగా వర్షాలు కురుస్తుండటం, వ్యా ధుల సీజన్ అని తెలిసినా పశుసంవర్ధకశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని కాపరులు వాపోతున్నారు.
జిల్లాలో ఎక్కువగా నారాయణపేట్, మరికల్, పెబ్బేర్, కొల్లాపూర్, బాలానగర్, భూత్పూర్, తాడూర్, తెల్కపల్లి, మహబూబ్‌నగర్ తదితర మండలాల్లో గొర్రెలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50లక్షల గొర్రెలు ఉండగా, వీటిపెంపకపై సుమారు 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గొర్రెలు వ్యాధులబారినపడి మృత్యువాతపడుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి.
మూగజీవాలు విలవిల
Published Sun, Sep 15 2013 5:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement