
సాక్షి, నిర్మల్ : భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భైంసా మండలం కామోల్ శివారులోని వాగులో 100 మేకలు, గొర్రెలు, సహా కాపరి రాము చిక్కుకుపోయారు. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతొ ఒక్కసారిగా వాగు పొంగిపొర్లింది. అయితే వాగు మధ్యలో బండరాయిపై నిల్చుని కాపరి రాము ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ గొర్రెలు, మేకలు మాత్రం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే గ్రామస్తుల సహకారంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేయించారు. నీటి ప్రవాహం తగ్గాక సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జైనూర్ మండలం కిషన్ నాయక్ తండా గ్రామస్తులు వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ గర్భిణీని వాగు దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment