నిజామాబాద్ : ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిడ్డ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ గొర్రె రైలు పట్టాలు దాటడంతో మిగతా గొర్రెలు కూడా రైలు వచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గొర్రెల యజమాని బండారు వీరయ్య తెలిపారు. గొర్రెల మృతితో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
రైలు కిందపడి 30 గొర్రెలు మృతి
Published Wed, Aug 5 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement