లక్షలు పలుకుతున్న 'అల్లాహ్' పొట్టేలు
సాక్షి,సిటీబ్యూరో: పహాడీషరీఫ్ షాహిన్‌నగర్‌కు చెందిన మహ్మద్ రఫియుద్దీన్ అనే వ్యక్తి పది రోజుల క్రితం జడ్చర్లలో 130 పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. కాగా ఇందులో ఒక పొట్టేళ్లు చర్మంపై అరబ్ భాషలో అల్లాహ్ అని రాసినట్లుగా మచ్చ రూపంలో ఉండడాన్ని గుర్తించి దానిని ప్రత్యేకంగా అవ్ముకానికి పెట్టాడు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌లో పొట్టేలు రూపంలో దేవుడు ఉన్నాడని భావిస్తున్న వారు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పొట్టేలుకు రూ. 2.5 లక్షలు వెచ్చించేందుకు పలువురు వుుందుకు వచ్చారని, అయితే దీనిని అమ్మాలా...? వద్దా...? ఇంకా నిర్ణయించుకోలేదని రఫియుద్దీన్ తెలిపారు.