ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి | accidentally 105 sheeps died on thursday | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి

Published Fri, Feb 20 2015 2:00 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి - Sakshi

ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి

ఎల్లారెడ్డి : నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, పెద్ద నారాయణ ఇలా ఓ పన్నెండు మంది తమ మేకలను మేత కోసం గురువారం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా... ఎల్లారెడ్డి మండలం జంకంపల్లి వద్ద చెరువు కట్టపై నుంచి మేకలు, గొర్రెలు జారి లోతైన ప్రదేశంలో పడిపోయాయి.

ఈ ప్రమాదంలో సుమారు 105 వరకు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. అయితే, మేతకు తీసుకొచ్చినవి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొన్ని జారిపడిపోయిన విషయాన్ని వాటి యజమానులు గమనించలేదు. శుక్రవారం ఉదయం కొన్ని తగ్గినట్టు గుర్తించి వెనక్కి వెళ్లి చూడగా... చెరువు గట్టు పక్కన మృతి చెంది ఉండడం కనిపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement