![అందమైన గొర్రెకు కాసుల వర్షమే - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61473615192_625x300.jpg.webp?itok=-uSEpXRy)
అందమైన గొర్రెకు కాసుల వర్షమే
సాక్షి,సిటీబ్యూరో: త్యాగానికి మారుపేరైనా బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ(త్యాగం) కోసం కొనుగోలు చేసే పోటేళ్లకు ధర కంటే వాటి శరీర ఆకృతికే ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి గాయాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాటినే ఇందుకు కొనుగోలు చేస్తారు. చెవులు, కొమ్ములకు గాయాలు (చెవి తెగిపోవడం.... కొమ్ము విరిగిపోవడం)లాంటివి ఉంటే అవి ఖుర్బానీలకు పనికిరావు. సాధారణ రోజుల్లో గొర్రెలు, పొట్టేళ్ల బరువును బట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఖుర్బానీ కోసం కొమ్ములుండి చూడడానికి అందంగా కనిపించే పొట్టేళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.