పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఉదయం ఓ లారీ.. గొర్రెల మందను ఢీ కొట్టింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఉదయం ఓ లారీ.. గొర్రెల మందను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.