కుక్కల దాడిలో 68గొర్రెలు మృతి
కౌతాళం: మండల పరిధిలోని అడవుల్లో సోమవారం రాత్రి ఆరు కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 68గొర్రెలు మృతిచెందినట్లు వాటి యజమానులు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ తాలుకా నర్వ గ్రామానికి చెందిన మల్లేష్, బాలప్ప తెలిపారు. అక్కడ మేత లేకపోవడంతో దాదాపు వెయ్యి గొర్రెలను ఇటీవల కౌతాళం మండలంలోని అడవుల్లోకి వాటి కాపరులు తీసుకొచ్చారు. అందులోభాగంగా సోమవారం రాత్రి కుక్కలు మందపై దాడి చేశాయి. కాపరులు తేరుకునేలోపు 68 గొర్రెలు మృతిందగా 9తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.7లక్షలు నష్టం వాటిల్లిందని జయమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కురువ సంఘం మండల అధ్యక్షుడు వీరేష్ సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన నష్టాని ఆర్‌ఐ రామచంద్రకు చేరవేయడంతో ఆయన కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి యజమానులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.