thousend
-
భూకంపాన్ని పసిగట్టిన పక్షులు?.. వీడియో వైరల్!
జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 -
మన వెయ్యి రూపాయలు.. అక్కడ లక్షపైమాటే!
మనం డాలర్‌తో భారత రూపాయిని పోల్చి చూసినప్పుడు మన కరెన్సీ విలువ చాలా తక్కువనిపిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో భారత కరెన్సీకి అత్యధిక విలువ ఉంది. ఆ దేశానికి మనం మన వెయ్యి రూపాయలు తీసుకెళ్తే, అది అక్కడ లక్షలకు సమానమవుతుంది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే వాస్తవం. వియత్నాం.. సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్. అంటే ఆ దేశానికి మనం వెయ్యి రూపాయలు తీసుకువెళితే, అది అక్కడ 2,91,000 వియత్నామీస్ డాంగ్ అవుతుంది. వియత్నాం వెళ్లడానికి ఏదోఒక ప్రత్యేక సీజన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఏ సీజన్లోనైనా వియత్నాంను సందర్శించవచ్చు. అయితే చాలా మంది పర్యాటకులు డిసెంబర్-జనవరి మధ్య ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వియత్నాంలొని హాలాంగ్ బే ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని ‘బే ఆఫ్ డిస్కవరింగ్ డ్రాగన్స్’ అని కూడా అంటారు. 1994లో యునెస్కో ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. వియత్నాం రాజధాని హనోయి కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ నగరానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. వియత్నాం ఉత్తర భాగంలో ఉన్న హువా గియాంగ్ కూడా పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందింది. ఇది కూడా చదవండి: యమునలో కరసేవకులకు పిండ ప్రధానం -
వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం?
అసోంలోని బార్పేట జిల్లాలో వేలాది పక్షులు ఉన్నట్టుండి మృతి చెందిన విషయం కలకలం రేపుతోంది. వాటికి విషం పెట్టి చంపేశారని పలువురు భావిస్తున్నారు. ఈ చర్యకు బాధ్యులైన అరాచక శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ అరణ్యక్ డిమాండ్ చేసింది. పంటపొలాల్లో చచ్చిపడి.. విషప్రయోగంతో వేలాది పక్షులు మృతి చెందాయనే వార్త తెలియగానే పర్యావరణ సంరక్షణాభిషులు, పక్షిప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న పర్యావరణ ప్రేమికుడొకరు మాట్లాడుతూ అసోంలోని బార్పేట్ జిల్లాలోని జానియా గ్రామంలో వేలాది పక్షులకు విషం ఇచ్చారని, అవి పంటపొలాల్లో చచ్చిపడివున్నాయని తెలిపారు. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఆ పక్షులు పంటపొలాల్లోని ధాన్యపు గింజలను తిన్నాక మృతి చెందాయి. పంటపొలాల నుంచి పక్షులను తరిమివేసేందుకే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న అరణ్యక్ సిఈఓ డాక్టర్ విభాబ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ, విషం కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృతి చెందడం తనను ఎంతో కలచివేస్తున్నదన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాలన్నారు. పంటలకు పక్షులు చేసే మేలు ఇదే.. యంత్రాలతో పోల్చిచూస్తే పక్షులు పంట దిగుబడికి ఎంతో సాయపడతాయని డాక్టర్ విభాబ్ కుమార్ అన్నారు. పంటలకు నష్టం కలిగించే కీటకాలు,పురుగులను పక్షులు తింటాయని, ఫలితంగా పంటనష్ట నివారణ జరుగుతుందన్నారు. అదేవిధంగా పక్షుల కారణంగా పంటపొలాల్లో రసాయన మందుల వాడకం తగ్గుతుందన్నారు. పక్షులు పంటపొలాల్లో తిరుగాడుతూ.. పరపరాగ సంపర్కం చేస్తాయని, ఫలితంగా మొక్కల జాతుల ఉత్పత్తి మరింత సులభమవుతుందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
వణికిస్తున్న డెంగీ
కరీంనగర్ హెల్త్ : జిల్లా ప్రజలను డెంగీ వణికిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు కరీంనగర్‌లోని మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు, డాక్టర్స్ స్ట్రీట్‌లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం డాక్టర్ పిలుపుకోసం కనీసం ఐదారుగంటల వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం 9 గంటలకు ముందు నుంచే రోగులు చీటి కోసం క్యూ కడుతున్నారు. ఆస్పత్రిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఓపీ చీటి ఇస్తుండటంతో రోగులు ఎమర్జెన్సీ వార్డులో క్యూలు కడుతున్నారు. 500 పైగా డెంగీ కేసులు జిల్లాలో 500 పైగా డెంగీ కేసులు నమోదు అయినట్లు సమాచారం. ప్రతిరోజు పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న నర్సింగ్ స్కూల్ విద్యార్థినులకు డెంగీ ఉన్నట్లు ప్రభుత్వ వైద్యులే నిర్ధారించారు. దీంతో వ్యాధి ఉధృతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విష జ్వరంతో ప్రభుత్వాస్పత్రిలో చేరినవారు డెంగీ అని నిర్ధారణ కాగానే ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. డెంగీ నిర్ధారిస్తే నోటీసులు.. డెంగీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినా రోగులకు ఈ విషయం చెప్పవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రయివేటు ఆస్పత్రుల వైద్యులు పరీక్షల ఫలితాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. డెంగీ ఉన్నట్లు రిపోర్టు ఇస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ నుంచి నోటీసులు ఇస్తున్నారు. దీంతో ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకులు కూడా డెంగీ నిర్ధారణ అయినా విష జ్వరంగానే రిపోర్టు ఇస్తున్నారు. రోగికి డెంగీ సోకినట్లు తమకు సమాచారం అందిస్తే బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపించి పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారని ఓ సీనియర్ ఫిజీషియన్ తెలిపారు. వెయ్యికి చేరుతున్న ఓపీ విషజ్వరాలతో కారణంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఓపీ నిత్యం వెయ్యికి చేరుతోంది. వర్షం నీరు నిలిచిపోవడంతో జిల్లాలో పారిశుధ్యం లోపించి దోమలు పెరిగాయని, చల్లని వాతావరణంతో డెంగీ విజృంభిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఒక్కో మండలంలో 200 మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతుండగా, వీరిలో కనీసం 10 మందిలో డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్లేట్లెట్స్ తగ్గాయని నిర్ధారణ కాగానే జ్వరపీడితులో ఆ్వస్పత్రిలో చేరుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 పడకలు ఉండగా అదనంగా మరో 100 పడకలు ఏర్పాటు చేశారు. అయినా అవి సరిపోవడం లే దు. ఓపీ మధ్యాహ్నం వరకే 700లకు చేరుతోంది. ఎమర్జెన్సీతో సాయంత్రం వరకు వెయ్యి దాటుతోంది. కాగా, ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇన్, ఔట్ పేషెంట్లకు నాలుగైదు గోలీలతోనే సరిపెడుతున్నారు. డాక్టర్ రాసినా సిబ్బంది అందులో సగం మందులు మాత్రమే ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు. ప్లేట్లేట్స్ ఎక్కించినా తగ్గుతున్నయ్ తిరుపతి(ఇంజినీరింగ్ విద్యార్థి), హుస్నాబాద్ తీవ్ర జ్వరంతో 12వ తారీఖున ఆస్పత్రిలో చేరాను. విషజ్వరం వచ్చిందని రిపోర్టులో చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజు 88 వేలు ప్లేట్లేట్స్ ఉన్నాయి. మొన్నటి వరకు మూడు సార్లు ప్లేట్లేట్ ఎక్కించారు. నిన్న రిపోర్టులో ప్లేట్లేట్ 48 వేలు ఉన్నాయి. ఈరోజు 36 వేలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు తగ్గుతున్నాయో అర్థకం కావడం లేదు. ఇంకా నాలుగు ప్లేట్లేట్ ప్యాకెట్ కావాలని రాశారు. రక్తం ఇవ్వడానికి నా స్నేహితులు ఎవరూ ఇక్కడ లేరు. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న –మహ్మద్ గౌస్, రామగుండం 15రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయని అక్కడ డాక్టర్ చెబితే నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన. ప్లేట్లేట్స్ పెరుగుతున్నయని చెబుతున్నారు. ఆరోగ్యం మెరుగ్గా అని పించడం లేదు. ఇంకా రక్తపరీక్షల రిపోర్టు రాలేదు. ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు. రోజు నాలుగు మాత్రలు ఇచ్చి గ్లోకోజ్ పెడుతున్నరు. రామగుండం అందరూ జ్వరాలతోనే బాధపడుతున్నరు. వీణవంక మండలం కొండపాకకు చెందిన కత్తిస్వామి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా పరీక్షలు చేయించుకోగా విషజ్వరం కారణంగా రక్తంలో ప్లేట్లేట్స్ 60 వేలకు పడిపోయాయని తెలిపారు. మూడు రోజులక్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇక్కడ పరీక్షల్లో 9 లక్షలు ఉన్నట్లు రిపోర్డులో తెలుపడంతో ఆశ్చర్యపోయారు. వ్యాధి నిర్ధారణలో తేడా ఉంటుండంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మంథని మండలం దుబ్బపల్లికి చెందిన మల్లేశం జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్లేట్స్ 38వేలకు పడిపోవడంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. టైపాయిడ్‌తోపాటు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు రోజులు అయినా డెంగీ నిర్దారణ రిపోర్టు ఇంకా రాలేదు. ప్రైవేటులో మందులు తెచ్చుకున్నట్లు బాధితుడు తెలిపాడు. రామగుండంకు చెందిన పర్వీన్ 15రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్లేట్లే ట్స్ తగ్గిపోయి కాళ్లువాపులు వచ్చి నడువలేని పరిస్థితిలో ఉంది.