
ముంబై: దేశీ దిగ్గజ స్కూటర్ల తయారీ కంపెనీ ‘హోండా’ తాజాగా ‘గ్రాజియా’ పేరిట కొత్త ఆటోమేటిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 8 అధునాత ఫీచర్లతో విడుదలైన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.57,897(ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). ఇది తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘యాక్టివా’కు అడ్వాన్స్‌డ్ వెర్షన్‌లాంటిదని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటొ చెప్పారు. ఈ నూతన స్కూటర్‌కు 125 సీసీ హెచ్‌ఈటీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపారు. దీన్లో 8 అధునాత ఫీచర్లు ఉన్నాయని, వీటన్నింటికి కంపెనీ పేరిట పేటెంట్ ఉందని చెప్పారాయన. సెల్‌ఫోన్ చార్జర్ సౌకర్యం కూడా ఉంది. అయితే.. డిస్క్ బ్రేక్, చార్జీంగ్ సౌకర్యం హైఎండ్ మోడల్స్‌లో మాత్రమే ఉంటాయి. వీటి ధరల శ్రేణి రూ.57,827– రూ.62,269 మధ్య ఉంది.
ఇక అన్ని మోడళ్లలోను ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, లీటరుకు 50 కిలోమీటర్లకుపైగా మైలేజ్, 3 స్టెప్ ఎకో–స్పీడ్ ఇండికేటర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీట్ ఓపెనర్ స్విచ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని మినోరు వివరించారు. ప్రధానంగా యువతను, పట్టణ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. గ్రాజియా వల్ల సంస్థ అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదవుతుందని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) వై.యస్.గులెరియా ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment