
బెంగళూరు: ఈ ఏడాది ఫిబ్రవరి ఆటో ఎక్స్‌పోలో సందడి చేసిన హోండా గోల్డ్ వింగ్ మోటార్‌సైకిల్ డెలివరీ ప్రారంభమయ్యింది. క్యాండీ ఆర్డెన్ట్ రెడ్ కలర్ టూరర్‌ల డెలివరీ మంగళవారం నుంచి ప్రారంభించామని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులెరియా తెలిపారు.
అత్యంత శక్తివంతమైన ఈ టూరర్ నూతనంగా అభివృద్ధిపరిచిన సిక్స్–సిలెండర్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్‌మెషీన్‌ను కలిగి ఉందని ఆయన వివరించారు. దీని ధర రూ.26.85 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment