దేశీ వాహన విక్రయాలు జూమ్ | Cars and two-wheelers sales zoomed fast in August (Roundup) | Sakshi
Sakshi News home page

దేశీ వాహన విక్రయాలు జూమ్

Published Fri, Sep 2 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

దేశీ వాహన విక్రయాలు జూమ్

దేశీ వాహన విక్రయాలు జూమ్

9-15 శాతం మధ్యలో వృద్ధి 
హోండా, అశోక్ లేలాండ్ అమ్మకాలు దిగువకు 
నిస్సాన్ విక్రయాలు 2 రెట్లు అప్
రెనో అమ్మకాలు 8 రెట్లు జంప్

న్యూఢిల్లీ: దేశంలో వాహన విక్రయాల జోరు కొనసాగుతోంది. ఆగస్ట్ నెలలో వార్షిక ప్రాతిపదికన మారుతీ, మహీంద్రా, టయోటా వంటి పలు కంపెనీల అమ్మకాలు ఎగశారుు. హోండా, అశోక్ లేలాండ్ విక్రయాలు తగ్గారుు. వాహన విక్రయాల పెరుగుదలకు పండుగల సీజన్, రుతుపవనాలు, కొత్త ప్రొడక్ట్‌ల ఆవిష్కరణ, డీజిల్ వాహనాలపై నిషేధం ఎత్తివేత వంటి పలు అంశాలు సానుకూల ప్రభావం చూపారుు.

మారుతీ సుజుకీ మొత్తం వాహన విక్రయాలు 12.2 శాతంమేర ఎగశారుు.1,17,864 యూనిట్ల నుంచి 1,32,211 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 12.3 శాతం వృద్ధితో 1,06,781 యూనిట్ల నుంచి 1,19,931 యూనిట్లకు ఎగశారుు. ఇక  మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం విక్రయాలు 14 శాతం వృద్ధితో 35,634 యూనిట్ల నుంచి 40,591 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 15 శాతం వృద్ధితో 32,122 యూనిట్ల నుంచి 36,944 యూనిట్లకు ఎగశారుు.

 టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ దేశీ విక్రయాలు 12,801 యూనిట్లుగా నమోదయ్యారుు. ఫోర్డ్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 23 శాతం వృద్ధితో 21,520 యూనిట్ల నుంచి 26,408 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 8,331 యూనిట్ల నుంచి 8,548 యూనిట్లకు ఎగశారుు. హ్యుందాయ్ మొత్తం వాహన విక్రయాలు 9 శాతం వృద్ధితో 54,607 యూనిట్ల నుంచి 59,707 యూనిట్లకు ఎగశారుు. ఇక దేశీ విక్రయాలు 6 శాతం వృద్ధితో 40,505 యూనిట్ల నుంచి 43,201 యూనిట్లకు పెరిగారుు. ఇక ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలు 6 శాతం వృద్ధితో 4,191 యూనిట్ల నుంచి 4,447 యూనిట్లకు పెరిగారుు. టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 40,679 యూనిట్ల నుంచి 43,061 యూనిట్లకు పెరిగారుు.

 నిస్సాన్ దేశీ వాహన విక్రయాలు రెండు రెట్లు పెరిగారుు. 2,809 యూనిట్ల నుంచి 5,918 యూనిట్లకు ఎగశారుు. కాగా కంపెనీ తన కొత్త జీటీ-ఆర్ వెర్షన్‌కు ప్రి-బుకింగ్‌‌సను ప్రారంభించింది. ఇక రెనో వాహన విక్రయాలు ఏకంగా 8 రెట్లు పెరిగారుు. 1,527 యూనిట్ల నుంచి 12,972 యూనిట్లకు ఎగశారుు. అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాలు 6 శాతం తగ్గుదలతో 10,897 యూనిట్లకు క్షీణించారుు. హోండా దేశీ కార్ల విక్రయాలు 11 శాతం క్షీణతతో 15,655 యూనిట్ల నుంచి 13,941 యూనిట్లకు తగ్గారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement