
హోండా ఇండియా వరల్డ్ రికార్డ్ అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఎస్‌ఐ) అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఒక్క 2017-17 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పోటీలో ధీటుగా నిలబడింది. ఒక్క ఈ సంవత్సరంలో హోండా 50 లక్షల టు వీలర్స్ అమ్మకాలతో భారీ గ్రోత్ సాధించి ఆల్ టైం రికార్డ్‌ను తాకింది. మొత్తం అమ్మకాలు 12శాతం ఎగిసి 5,008,103 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. గత ఏడాది 4,483,462 వాహనాల అమ్మకాలతో పోలిస్తే డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసినట్టు సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ వెల్లడించారు. ఇదే కాలానికి మొత్తం పరిశ్రమం 5 శాతం వృద్ధిని సాధిస్తే హోండా ఇండియా మాత్రం రెట్టింపు సాధించింది.
మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చారిత్రాత్మక అమ్మకాలగో కొత్త రికార్డులు సృష్టించినట్టు సింగ తెలిపారు. ముఖ్యంగా 7వ వేతన సంఘం సిఫారసులు, మంచి వాతావరణ సంకేతాలు తమకు బూస్ట్ ఇచ్చినట్టు చెప్పారు. 2017-18 మరో ముఖ్యమైన సంవత్సరంగా నిలవునుందన్నారు. 5 మిలియన్ అమ్మకాలతో మైలురాయిని అధిగమించినందుకు తమ వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు. అయితే ద్విచక్ర వాహనాల పరిశ్రమ కేవలం 5 శాతం పురోగమించిందన్నారు. ఈ నేపథ్యంలో తమబ్రాండ్‌ను వినియోగదారులు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆటోమేటిక్ స్కూటర్ అమ్మకాలు తొలిసారి 30 లక్షల మార్క్ ను దాటాయి. 16 శాతం వృద్ధితో 3,351,604 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది వీటి సంఖ్య 2,892,480 మాత్రమే.