రూ.6.80 లక్షల బైక్ లాంచ్ చేసిన హోండా‌ | HMSI Drives In CB500X Priced At Rs 6 87 Lakh | Sakshi
Sakshi News home page

రూ.6.80 లక్షల బైక్ లాంచ్ చేసిన హోండా‌

Published Mon, Mar 15 2021 7:51 PM | Last Updated on Mon, Mar 15 2021 7:55 PM

HMSI Drives In CB500X Priced At Rs 6 87 Lakh - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) నేడు దేశంలో సిబి500 ఎక్స్‌ని రూ.6.87 లక్షల(ఎక్స్‌షోరూమ్, గురుగ్రామ్) ధరతో విడుదల చేసింది. ఈ మోడల్ కోసం కంపెనీ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ నీ కంపెనీకి చెందిన బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించనున్నారు. ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు.

హోండా సీబీ 500ఎక్స్ లో ట్విన్ సిలిండర్‌ 471 సీసీ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఈ ట్విన్-సిలిండర్ ఇంజన్ 47 బిహెచ్‌పి గరిష్ట శక్తిని, 43.2 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంది. డైమండ్ ఆకారంలో ఉన్న స్టీల్-ట్యూబ్ ఫ్రేమ్ ఆధారంగా కొత్త సిబి 500 ఎక్స్‌కు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో హోండా ప్రో-లింక్ మోనోషాక్ 9-స్టెప్ స్ప్రింగ్ ప్రీలోడ్ సస్పెన్షన్ లభిస్తుంది. ముందు భాగంలో 310 ఎంఎం డిస్క్ ఉండగా, వెనుక వైపు 240 ఎంఎం డిస్క్ ఉంది. డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ కూడా ఉంది. హోండా సిబి 500ఎక్స్‌లో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, నెగటివ్-డిస్‌ప్లే ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అప్‌స్వీప్ట్ ఎగ్జాస్ట్, అసిస్ట్/స్లిప్పర్ క్లచ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఈ బైక్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ రెడ్‌, మ్యాటీ గన్‌ పౌడర్‌ బ్లాక్‌ మెటాలిక్‌ రంగుల్లో లభించనుంది.

చదవండి:

మారుతి సుజుకి బంపర్ అఫర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement