Honda Company Revealed The Most Powerful Civic Type R 2023 Car - Sakshi
Sakshi News home page

2023 Civic Type R: మోస్ట్‌ పవర్‌ఫుల్‌ హోండా 2023 సివిక్‌ టైప్‌-ఆర్‌ ఆవిష్కారం

Published Fri, Jul 22 2022 5:05 PM | Last Updated on Fri, Jul 22 2022 5:55 PM

2023 Honda Civic Type R revealed the most powerful Type R - Sakshi

సాక్షి, ముంబై: హోండా  కొత్త సివిక్‌ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్‌ టైప్-ఆర్‌ 2023’ను  పరిచయం చేసింది. త్వరలోనే    వీటి ధరలు,  ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి.   30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్‌ బ్రాండెడ్‌ మోడల్‌ అని హోండా వెల్లడించింది.

కొత్త హోండా సివిక్ టైప్ -ఆర్‌ 11వ-తరం సివిక్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆధారపడి ఉంది. 2023 సివిక్ టైప్ R 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను జోడించనుంది. డిజైన్ పరంగా రీడిజైన్ చేసిన బాడీవర్క్‌తో వస్తుంది. , రీడిజైన్ లోయర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ వెంట్‌లు  బానెట్ డిజైన్‌,  మిచెలిన్ పైలట్ స్పోర్ట్ 4S టైర్లు,  తేలికపాటి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో దీన్ని రూపొందించింది. 

టైప్ R 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డిజిటల్ కాక్‌పిట్, రెడ్ టైప్ R ట్రిమ్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్లు , గ్రాఫిక్ ఇంజిన్ rpm డిస్‌ప్లే, రెవ్ ఇండికేటర్ లైట్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్‌ లాంటి స్పెషల్‌ ఫీచర్లతో స్పెషల్‌ డిజైన్‌తో రానుంది. హిస్టారిక్ ఛాంపియన్‌షిప్ వైట్, ర్యాలీ రెడ్, బూస్ట్ బ్లూ, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ & సోనిక్ గ్రే పెర్ల్. ఐదు రంగుల్లో  ఆకర్షణీయంగా లాంచ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement