global lauch
-
మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం
సాక్షి, ముంబై: హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. కొత్త హోండా సివిక్ టైప్ -ఆర్ 11వ-తరం సివిక్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆధారపడి ఉంది. 2023 సివిక్ టైప్ R 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను జోడించనుంది. డిజైన్ పరంగా రీడిజైన్ చేసిన బాడీవర్క్‌తో వస్తుంది. , రీడిజైన్ లోయర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ వెంట్లు బానెట్ డిజైన్, మిచెలిన్ పైలట్ స్పోర్ట్ 4S టైర్లు, తేలికపాటి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో దీన్ని రూపొందించింది. టైప్ R 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, డిజిటల్ కాక్‌పిట్, రెడ్ టైప్ R ట్రిమ్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్లు , గ్రాఫిక్ ఇంజిన్ rpm డిస్ప్లే, రెవ్ ఇండికేటర్ లైట్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్ లాంటి స్పెషల్ ఫీచర్లతో స్పెషల్ డిజైన్‌తో రానుంది. హిస్టారిక్ ఛాంపియన్షిప్ వైట్, ర్యాలీ రెడ్, బూస్ట్ బ్లూ, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ & సోనిక్ గ్రే పెర్ల్. ఐదు రంగుల్లో ఆకర్షణీయంగా లాంచ్ కానుంది. It’s here. Get your first look at the all-new 2023 #CivicTypeR, officially unveiled in North America. Learn more: https://t.co/fAHw276zgl pic.twitter.com/iM5CznMf6W — Honda (@Honda) July 21, 2022 -
షావోమి బిగ్ లాంచ్ : ఎంఐ ఏ1
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. బిగ్ లాంచ్ అంటూ ఊరిస్తూ వచ్చిన కంపెనీ ఎంఐ ఎ 1 పేరుతో డ్యుయల్ రియర్ కెమెరాలతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. షావోమి గ్లోబల్లాంచ్ 2017లో ఇండియాలో మొట్ట మొదటి రెండు రియర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ లవర్స్‌కి అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. ఫుల్ మెటల్‌బాడీ, ప్రీమియం డిజైన్ , 10వీ స్మార్ట్ పీఏ హై క్వాలిటీ ఆడియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్లతోపాటు డ్యూయల్ కెమెరా(ఫ్లాగ్ షిప్)(డీఎస్ఎల్ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాకెట్) వన్ వైడ్ యాంగిల్ కెమెరా, వన్ వర్టికల్ కెమెరా తమ తాజా డివైస్ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. క్రియేటెడ్ బై షావోమి, పవర్డ్ బై గూగుల్ అని షావోమి తెలిపింది. దీని ధరను రూ.14,999గా నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇది విక్రయానికి అందుబాటులోఉండనుంది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి గూగుల్ తాజా ఓఎస్ ఓరియో ఆప్డేట్ అందిస్తుందిట. ఎంఐ ఏ1 ఫీచర్లు 5.5 ఫుల్ హెచ్డీ డిస్ప్లే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే అవకాశం 12 ఎంపీ పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ