
గ్లోబల్ మార్కెట్ల సానుకూల ట్రెండ్‌తో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి.
ముంబై : గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడుతుండగా..వొడాఫోన్, యస్‌బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, అశోక్ లేలాండ్ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 381 పాయింట్ల లాభంతో 41,597 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 116 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,223 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.