పెరిగిన బంగారం ధర!
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో లోహపు ధరలు పరుగులు పెట్టడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర 605 పెరిగి 28,625కు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
అలాగే కిలో వెండి ధర 1800 పెరిగి 44,900 కు చేరుకుంది. డాలర్ బలహీనపడటం బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. ఇరాక్ లో పరిస్థితి అదుపుతప్పడంతో బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని ఇన్వెస్టర్లు భావించడం పెరుగుదలకు మరో కారణమని తెలిపారు.