
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్‌సైట్‌లో లిస్ట్ అయి ఉంది.
మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్‌ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఉంటుందని తెలిపింది.
MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్‌సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్‌ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్‌ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది.
ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు
7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13
56+16+8 ఎంపీ రియర్ కెమెరా
32+32 సెల్ఫీ కెమెరా
12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్
4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్
Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023
Comments
Please login to add a commentAdd a comment