Samsung Coming With Tri Fold Display May Debut, Tipster Claims - Sakshi
Sakshi News home page

ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌: శాంసంగ్‌ మరో వినూత్న ఆవిష్కారం!

Published Sat, Mar 25 2023 4:38 PM | Last Updated on Sat, Mar 25 2023 5:13 PM

Samsung comoing With Tri Fold Display May Debut Tipster Claims - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా  దిగ్గజం శాంసంగ్‌ మరో కీలక ఆవిష్కారానికి సిద్ధమవుతోంది. మూడు ఫోల్డింగ్స్‌తో  ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నద్ధమవుతోందిట. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ షేర్ చేసిన వివరాల ప్రకారం, శాంసంగ్‌ ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

మరోవైపు ఈ ఏడాది చివర్లో లాంచ్‌  చేయనుందని భావిస్తున్న ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్  'ఫ్యాన్ ఎడిషన్’ శాంసంగ్‌  గెలాక్సీ  ఎస్‌23 ఎఫ్‌ఈ  సంస్థ డెవలప్‌ మెంట్‌లో లేదని టిప్‌స్టర్ తెలిపింది. మూడు మడతలతో కాన్సెప్ట్ డిస్ప్లే పిక్స్‌ను షేర్‌ చేసింది. గతంలో CES 2022లో ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లేలతో కాన్సెప్ట్ పరికరాలను ప్రదర్శించింది. జెడ్‌ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ల మెరుగైన వెర్షన్‌పై పని చేస్తోందనీ, ముఖ్యంగా జెడ్ ఫోల్డ్‌  5 గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్ 5గా తోపాటు మూడు మడతల ఫోన్‌ తీసుకు రానుందని తెలిపింది. ఫ్లెక్స్  ఎస్‌, ఫ్లెక్స్ జీ పేరుతో ఇవి రానున్నాయని అంచనా.

కాగా జనవరిలో Samsung CES 2023లో 360-డిగ్రీల రొటేటింగ్ స్క్రీన్‌తో “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్‌ప్లే కోసం ప్రోటోటైప్‌ను  ప్రదర్శించింది. డిస్‌ప్లే లోపలికి బుక్ కవర్‌లా, లేదా వార్తాపత్రికలా బయటకి మడవగలదు. సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌తో ఫంక్షనల్ “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్‌ప్లే జోడిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement