అమెరికా మార్కెట్ల భారీ పతన ప్రభావం
ఒక శాతానికి పైగా నష్టపోయిన సూచీలు
25 వేల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది.
ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి.
సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం
అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్‌విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్‌డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది.
డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment