Heavy Fall
-
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
Bear attack: క్రాష్ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ ప్రతాపం చూపింది. ఫలితంగా కొత్త ఏడాదిలో జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ గత, 18 నెలల్లో భారీ పతనాన్ని బుధవారం చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు(8.46%)పతనం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆందోళనలు, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం గతేడాది (2023) చైనా ఆర్థిక వృద్ధి నిరాశపరచడం తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.69 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.370 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా గడిచిన 2 రోజుల్లో రూ.5.73 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్ ఉదయం సెన్సెక్స్ 1,130 పాయింట్ల పతనంతో 71,999 వద్ద, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 21,647 వద్ద మొదలయ్యాయి. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,699 పాయింట్లు క్షీణించి 71,429 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు దిగివచ్చి 21,550 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 460 పాయింట్లు పతనమై 21,572 వద్ద స్థిరపడ్డాయి. 2022 జూన్ 13 తర్వాత సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. ► చైనా ఆర్థిక వృద్ధి రేటు 2023లో (5.2%) అంచనాలు అందుకోలేకపోవడం, డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకోవడంతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెయిల్ 5%, టాటా స్టీల్, నాల్కో, జిందాల్ స్టీల్ షేర్లు 4% పతనమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎన్ఎండీసీ, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3%, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో జింక్ షేర్లు 2.5% నుంచి ఒకశాతం చొప్పున నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీకి.. రూ.1.07 లక్షల కోట్ల నష్టం హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. రుణ వృద్ధి, లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌సీఆర్)లపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, మోర్గాన్ స్టాన్లీలు షేరు రేటింగ్ తగ్గించాయి. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 8.46% నష్టపోయి రూ.1,537 వద్ద ముగిసింది. బ్యాంకు మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.1.07 లక్షల కోట్లు ఆవిరై రూ.11.66 లక్షల కోట్లకు దిగివచి్చంది. అత్యంత విలువైన పీఎస్‌యూగా ఎల్ఐసీ ఎల్ఐసీ కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ లిస్టెడ్ కంపెనీల్లో అత్యంత విలువైనదిగా అవతరించింది. ఈ షేరు ఇంట్రాడేలో 3% లాభపడి రూ.919 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 1% నష్టంతో రూ.887 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.5.60 లక్షల కోట్లకు చేరింది. ఎస్బీఐ షేరు 1.67% తగ్గింది. మార్కెట్ క్యాప్ రూ.5.58 లక్షల కోట్లుగా నమోదై రెండో స్థానానికి దిగివచ్చింది. కుప్పకూలింది ఇందుకే... హెచ్డీఎఫ్సీ బ్యాంకు పతన ప్రభావం అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు (8.46%) నష్టం పతనం సూచీల భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఆందోళన యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల డీలా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లు 2% క్షీణించి నెల రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. యూరప్ మార్కెట్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతన ప్రభావం దలాల్ స్ట్రీట్పైనా పడింది. -
మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్..!
టోక్యో/న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు. పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత. ఆస్ట్రేలియా స్టాక్ సూచీ 5 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ 3 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్టీఎస్సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగిఉంటే, సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు. -
రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 26 పైసలు పతనమై 71.81 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది నెలల కాలంలో (డిసెంబర్ 14న 71.90) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, బయటకు వెళుతున్న విదేశీ నిధులు దీనికి కారణం. చైనా కరెన్సీ యువాన్ పతనం, వర్థమాన మార్కెట్ కరెన్సీల తీవ్ర ఒడిదుడుకులకు కారణమైంది. బలహీనధోరణిలో 71.65 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 71.97ను కూడా చూసింది. అంతర్జాతీయంగా పటిష్టంగా ఉన్న క్రూడ్ ధరలు సైతం రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్, క్రూడ్ ధరల పటిష్టత వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
‘బేర్’ బాజా!
ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్’కు ఆరంభంగా పరిగణించకూడదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు డౌన్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్ఎస్ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హిందుస్తాన్ యూని లివర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► వేదాంత షేర్ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► ఓపెన్హీమర్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వైభవ్ గ్లోబల్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.6 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. రెండు నెలల్లో 9 శాతం డౌన్ ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్ 3న రికార్డ్ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, రిలయన్స్ క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎల్, జైన్ ఇరిగేషన్ , రిలయన్స్ ఇన్ఫ్రా, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి కారణాలు ఇవీ.... ► ఫెడ్ కామెంట్స్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్‌కు ఆరంభం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. ► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి. ► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్ మార్కెట్ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్‌పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ. సూపర్ రిచ్ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ► రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో 69.20కు పడిపోయింది. -
‘ఫెడ్’ భయాలతో...
సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.92 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.93,83,643కు పడిపోయింది. సెన్సెక్స్ 563 పాయింట్లు డౌన్; 25,202 వద్ద ముగింపు - అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో అమ్మకాల వెల్లువ - 168 పాయింట్ల క్షీణతతో 7,655కు నిఫ్టీ - వరుసగా నాలుగో వారమూ నష్టాల్లోనే.. స్టాక్‌మార్కెట్‌ను నష్టాలు వదలడం లేదు. అప్పుడప్పుడు కొంచెం పెరుగుతున్నా... అంతలోనే బేర్ మంటోంది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో శుక్రవారం సైతం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు కీలకంగా భావించే ఉద్యోగాల గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో... ఆసియా, యూరోప్ మార్కెట్లు నష్టాల పాలవడం మన స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 562 పాయింట్లు (2.18 శాతం) నష్టపోయి 25,202 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 168 పాయింట్లు (2.15 శాతం) క్షీణించి 7,655 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు 14 నెలల్లో ఇదే అత్యంత బలహీనమైన ముగింపు. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. అమ్మకాల వెల్లువ... అమెరికా పేరోల్స్ డేటా నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. రేట్ల పెంపుకు దోహదం చేసే విధంగానే ఈ గణాంకాలు ఉండొచ్చనే అంచనాలతో స్టాక్మార్కెట్లో అమ్మకాలు పోటెత్తాయి. రూపాయి పతనం కూడా ప్రభావం చూపింది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తుండడం వల్ల వ్యవసాయ దిగుబడులు తక్కువ స్థాయిలో ఉంటాయన్న ఆందోళన అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచింది. రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి. ఇన్ఫ్రా, విద్యుత్తు, బ్యాంక్, ఫార్మా షేర్ల నష్టాల పాలయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, అమెరికా ఫెరడల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు... ఈ రెండంశాలూ స్టాక్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు. అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనతో విదేశీ నిధులు తరలిపోతున్నాయని వారంటున్నారు. సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,119 పాయింట్ల కనిష్ట స్థాయిని (గురువారం ముగింపుతో పోల్చితే 646 పాయింట్ల నష్టం) తాకింది. చివరకు 563 పాయింట్ల నష్టంతో 25,202 పాయింట్ల వద్ద ముగిసింది. నాలుగేళ్లలో ఇదే దారుణమైన ‘వీక్’ ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 1,190 పాయింట్లు (4.5 శాతం), నిఫ్టీ 347 పాయింట్లు (4.33 శాతం) చొప్పున నష్టపోయాయి. ఒక వారంలో సూచీలు ఇంతలా పతనం కావటం గడిచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో వారమూ నష్టాల్లోనే ముగిసింది. ఒక్క నెలరోజుల కాలంలోనే సెన్సెక్స్ 10 శాతం వరకూ పతనమైంది. చైనా దేశం తన కరెన్సీ విలువను తగ్గించిన గత నెల 11 నుంచి చూస్తే సెన్సెక్స్ సుమారుగా 2,900 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 16 శాతం పడిపోయింది. కొనసాగుతున్న ఎఫ్ఐఐల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.1,287 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు. సెప్టెంబర్‌లో ట్రేడింగ్ జరిగిన నాలుగు రోజుల్లో ఎఫ్ఐఐలు రూ.4,000 కోట్ల నికర అమ్మకాలు జరపడం విశేషం. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విషయమై ప్రభుత్వం ఊరటనిచ్చినా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు ఆగలేదు. కాగా గత నెలలో ఎఫ్ఐఐలు రూ.17,000 కోట్లకు పైగా నికర అమ్మకాలు జరిపారు. రెండు సెన్సెక్స్ షేర్లకే లాభాలు... 30 సెన్సెక్స్ షేర్లలో భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. వేదాంత అధికంగా నష్టపోయింది. వేదాంత, హిందాల్కో, గెయిల్, టాటా స్టీల్ 4-5 శాతం రేంజ్లో పడిపోయాయి. బేస్ రేట్ గణనకు సంబంధించి ఆర్బీఐ తాజా మార్గదర్శకాల వల్ల బ్యాంక్‌ల లాభదాయకత దెబ్బతింటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐలు 2-3.5 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ఆ షేర్లు 2 శాతం వరకూ క్షీణించాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కంపెనీలు 2-3 శాతం రేంజ్లో పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,287 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,129 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ప్రపంచ మార్కెట్లు ఇలా... జపాన్ నికాయ్ 2.1 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.45 శాతం చొప్పున పడిపోయాయి. అన్ని ఆసియా మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సెలవుల కారణంగా చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ పనిచేయలేదు. యూరోప్ మార్కెట్లు కూడా 2-3 శాతం మేర కూడా భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్ల విషయానికొస్తే.. డోజోన్స్ సూచీ 300 పాయింట్లు, నాస్డాక్ ఇండెక్స్ 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. అయోమయంగా ఉద్యోగ గణాంకాలు శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం అగస్టులో అమెరికాలో 1,73,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగం రేటు 5.1%కి తగ్గింది. నిపుణులు 2,20,000 ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగం 5.2%కి తగ్గుతుందని అంచనా వేశారు. అంచనాల కంటే తక్కువగానే కొత్త ఉద్యోగాలు, మరోవైపు నిరుద్యోగం తగ్గడం అందర్నీ అయోమయంలో పడేసింది. ఈ నెల 16-17న జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీరేట్ల పెంపు నిర్ణయానికి ఈ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ గణాంకాలు మిశ్రమంగా వెలువడడంతో ఫెడ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి, అయోమయం ఇన్వెస్టర్లలో నెలకొంది. -
ఒడిదుడుకులను ఎదుర్కొంటాం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ - భారత్ ఆర్థిక పరిస్థితులు పటిష్టం - అందుబాటులో తగిన విదేశీ మారక ద్రవ్యం - రెపో కోతకు ద్రవ్యోల్బణం సహకరించాలి ముంబై: స్టాక్, కరెన్సీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. దేశంలో ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మన సొంతమని భరోసా ఇచ్చారు. అలాగే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగితే... వృద్ధికి ఊతం ఇచ్చే దిశలో తాజాగా రెపో రేటు తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. రెపో కోత ఎవ్వరో అడిగితే తగ్గించేది కాదని, అది అతి తక్కువ ధరల ద్వారా ఒనగూరే సహజ ఫలితమనీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో. ఈ రేటును ఈ ఏడాది ఇప్పటికే ఆర్బీఐ మూడుసార్లు తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.25 శాతంగా ఉంది. ఐబీఏ-ఫిక్కీ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ సమావేశంలో రాజన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... - భారత్ వద్ద ప్రస్తుతం 355 బిలియన్ డాలర్ల భారీ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు ఉన్నాయి. మరో 25 బిలియన్ డాలర్లు అందాల్సిన మొత్తం. ఈ నిల్వలు మన రూపాయి విలువ ఒడిదుడుకులను నియంత్రించడానికి దోహదపడతాయి. - భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలతోపాటు దిగువస్థాయి కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటుకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, తగిన స్థాయిలో ద్రవ్యోల్బణం, స్వల్ప కాలానికి సంబంధించి విదేశీ కరెన్సీ బకాయిలు తక్కువ స్థాయిలో ఉండడం వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను తెలియజేస్తున్నాయి. - తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో ఉంచే చర్యలు అమలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ వడ్డీరేట్లపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. బ్యాంకులు ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీరేట్లు తగ్గించి వృద్ధికి దోహదపడాలి. కరెన్సీ ఒడిదుడుకుల కట్టడి లక్ష్యం... భారత్ ప్రధాన లక్ష్యం రూపాయి ఒడిదుడుకులను నిరోధించడమేనని అన్నారు. ఒడిదుడుకులు తీవ్ర స్థాయిలో ఉంటే మనకు ఇబ్బందని తెలిపారు. రూపాయి భారీగా బలపడితే- మన ఎగుమతులకు ఇబ్బంది అవుతుందన్నారు. తీవ్ర స్థాయిలో బలహీనపడినా ఇబ్బందేనని అన్నారు. దిగుమతుల ద్రవ్యోల్బణం సమస్య దీనివల్ల పెరుగుతుందని విశ్లేషించారు. అందువల్ల మన రూపాయి మారకం విలువ సమతౌల్యంలో ఉండాలన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.