సెన్సెక్స్‌ 38,600–37,600 శ్రేణి కీలకం | India SENSEX Stock Market Index updates | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 38,600–37,600 శ్రేణి కీలకం

Published Mon, Aug 17 2020 4:43 AM | Last Updated on Mon, Aug 17 2020 4:43 AM

India SENSEX Stock Market Index updates - Sakshi

అమెరికా, జపాన్, చైనా స్టాక్‌ సూచీలు మినహా ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ గతవారం క్షీణతతో ముగిశాయి. కోవిడ్‌ నియంత్రణల్ని తీవ్రతరం చేయడంతో కొన్ని యూరప్‌ స్టాక్‌ సూచీల్లో తగ్గుదల అధికంగా వుంది. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 2 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే ఈ స్థాయిల నుంచి గణనీయమైన అప్‌ట్రెండ్‌ ఏర్పడే సంకేతాలు సైతం కన్పించడం లేదు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు.  ఇక భారత్‌ స్టాక్‌ సూచీల సాంకేతిక అంశాలకొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఆగస్టు 14తో ముగిసిన వారంలో 38,556 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్, వారంలో చివరిరోజైన శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసి 37,655 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 164 పాయింట్ల నష్టంతో 37,877 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాలుగా 2.5 శాతం శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్న సెన్సెక్స్‌ ఈ శ్రేణిని (37,600–38,600) ఎటోవైపు ఛేదిస్తేనే, ఆ దిశగా తదుపరి రోజుల్లో స్పష్టమైన ట్రెండ్‌ నెలకొంటుంది.

ఈ వారం మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైతే  38,220 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు.  ఈ అవరోధస్థాయిని దాటితే 38,440 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 38,620 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్‌ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా  37,650 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన వేగంగా 37,500 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 36,850 పాయింట్ల స్థాయి అతిముఖ్యమైన మద్దతు.

నిఫ్టీ తక్షణ నిరోధం 11,270
గతవారం ప్రథమార్ధంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,370 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, దాదాపు అదేస్థాయిని పదేపదే పరీక్షించి, శుక్రవారం 11,111 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 36 పాయింట్ల స్వల్పనష్టంతో 11,178 వద్ద ముగిసింది. రెండు వారాలనుంచి నిఫ్టీ ఎదుర్కొంటున్న 11,370 నిరోధాన్ని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. అలాగే రానున్న రోజుల్లో 200 డీఎంఏ వద్ద లభించబోయే కీలక మద్దతును నిఫ్టీ కోల్పోతే స్వల్పకాలిక కరెక్షన్‌ జరగవచ్చు. ఈ వారం మార్కెట్‌ పెరిగితే, 11,270 పాయింట్ల వద్ద  నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,325 స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే తిరిగి 11,375 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,090 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా  11,000 వరకూ క్షీణిం చవచ్చు. ఈ లోపున 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,845 వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement