మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో రూ.772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయినట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు కాలంలో ఫిష్ ఫామింగ్ బిజినెస్‌దారులకు జారీ అయినట్టు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్టు బ్యాంకు గుర్తించింది.