భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం  | Allahabad Bank defrauded of Rs 1775 cr by Bhushan Power | Sakshi
Sakshi News home page

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

Published Sat, Jul 13 2019 7:47 PM | Last Updated on Sun, Jul 14 2019 7:24 PM

Allahabad Bank defrauded of Rs 17775 cr by Bhushan Power - Sakshi

సాక్షి,ముంబై:  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల  రూపాయల స్కాంలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలహాబాద్‌ బ్యాంకులో భారీ  కుంభకోణం వెలుగులోకి వచ్చింది.  దివాలా తీసిన  భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌  కంపెనీ (బిపిఎస్ఎల్)  రూ .1,774.82 కోట్లకు ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు  శనివారం ప్రకటించింది. భూషణ​ స్టీల్‌ కంపెనీకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్‌ వర్గాలను విస్మయ పర్చింది. 
 
ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా  ఈ స్కాంను గుర్తించామని  రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాదు  బ్యాంకు  వెల్లడించింది.  దీంతో స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై  కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు  అలహాబాద్‌ బ్యాంకు  నివేదించింది.  ఇప్పటికే 900.20 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో  బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా గుర్తించినట్టు తెలిపింది.  

కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్‌బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్‌ఎల్‌ కేసు విచారణ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement