భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్యాంకు లావాదేవీలు, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో మోసానికి పాల్పడినందుకు అతడికి ఈ శిక్ష ఖరారైంది. భారత సంతతికి చెందిన అన్నామలై అన్నామలై(49)కు స్వామిజీ శ్రీ సెల్వం సిద్ధార్ అనే పేరు కూడా ఉంది. గార్జియాలోని ఓ హిందూ ఆలయానికి అతడు పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ కార్యాలకు ఉపయోగించకుండా భారీ మొత్తంలో అక్రమంగా ఆస్తులను పోగేసుకున్నాడని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని అతడిపై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. అతడు ట్యాక్స్లను కూడా ఎగ్గొట్టాడని తెలియడంతో న్యూయార్క్లోని ఓ కోర్టు ఆ స్వామిజీకి 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.