sentence
-
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
ఎఫ్ఆర్ఓ హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు మడకం తుల, పొడియం నాగకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. జీవితఖైదుతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఏడు నెలల్లోపే ఈ విచారణ పూర్తి చేసి శిక్ష విధించడం గమనార్హం. ఏం జరిగిందంటే... జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ పరిధి ఎర్రబోడులో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆ భూములను అటవీ అధికారులు స్వా«దీనం చేసుకుని ప్లాంటేషన్ చేశారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 22న గొత్తికోయలు ఆ భూముల్లో పశువులు మేపుతుండగా ప్లాంటేషన్ వాచర్ భూక్యా రాములు, బేస్ వాచర్ ప్రసాద్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని వారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దృష్టికి తేగా ఆయన రావికంపాడు సెక్షన్ అధికారి తేజావత్ రామారావుతో అక్కడికి వెళ్లారు. ఈ భూముల్లో పశువులు మేపొద్దని చెబుతూ.. వీడియో తీస్తుండగా గొత్తికోయలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మడకం తుల, పొడియం నాగ వేట కొడవళ్లతో ఎఫ్ఆర్ఓ మెడపై నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఖమ్మం తరలిస్తుండగానే మృతిచెందారు. ఈ ఘటనపై నాటి చండ్రుగొండ ఎస్ఐ విజయలక్ష్మి, సీఐ వసంత్‌కుమార్ కేసు నమోదు చేయగా, 24 మంది సాక్షులను విచారించిన జడ్జి.. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, అటవీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బోరు కొట్టి 106 మందిని చంపేశాడు
-
భారీ మోసం.. జైలుకు ఇండియన్ అమెరికన్స్
వాషింగ్టన్: పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష పడింది. దాదాపు 200 మిలియన్ డాలర్ల క్రెడిట్ కార్డు మోసానికి దిగిన విజయ్ వర్మ(49), తర్సీం లాల్(78) అనే ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదువేల డాలర్లను జరిమానా విధించింది. న్యూజెర్సీలో వీరిద్దరు ఓ జ్యూయెలరీ స్టోర్ యజమానులుగా ఉన్నారు. 2013లో ఓ పథకం పేరిట దాదాపు 7000 తప్పుడు చిరునామాలు, అడ్రస్ ప్రూఫ్‌లు పెట్టి దాదాపు వేలల్లో క్రెడిట్ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డారు. ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించి తమ స్టోర్‌లోనే స్వైపింగ్ చేసి క్రెడిట్ లిమిట్ మొత్తం తమ ఖాతాల్లోకి వచ్చేలా చూసుకున్నారు. ఇలా 200 మిలియన్ డాలర్లు వారి ఖాతాకు జమ అయింది. అయితే, ఆ తర్వాత ఆ అప్పును చెల్లించేందుకు కార్డు దారులు ముందుకు రాకపోవడంతో దర్యాప్తు చేయగా అసలు బండారం బయటపడింది. వారే క్రెడిట్ కార్డులు సృష్టించి వారే ఈ మోసానికి దిగినట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించగా మొత్తం 14 నెలల జైలు శిక్షతోపాటు 12 నెలలపాటు ఇంట్లోనే ఉండిపోయేలా శిక్ష వేసింది. -
ఏ షేర్లు పెరుగుతాయో ముందే తెలుసుకొని..
న్యూయార్క్: షేర్ విలువ ముందే తన భార్య ద్వారా తెలుసుకొని ఆ విషయం మిత్రులతో పంచుకొని ఓ భారత సంతతి వ్యక్తి జైలు పాలయ్యాడు. చట్ట విరుద్ధంగా షేర్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన అతడికి ఇరవై నెలల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా రెండు లక్షల అమెరికన్ డాలర్ల జరిమానా విధించడంతోపాటు వంద గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి నతనెయిల్ గార్టన్ తీర్పిచ్చారు. అమిత్ కనోడియా (49) అనే వ్యక్తి గతంలో ఓ ప్రైవేట్ ఇక్విటీలో పెట్టుబడులు పెట్టేవాడు. అతడి భార్య అపోలో టైర్స్ (భారత ఆధారిత కంపెనీ)లో జనరల్ కౌన్సిల్లో పనిచేస్తోంది. తన భార్య ద్వారా ఆ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ లో షేర్ విలువల విషయాలు తెలుసుకున్న గార్టన్, 2013లో తన మిత్రులు ఇఫ్తికర్ అహ్మద్, స్టివెన్లతో పంచుకుని అనంతరం షేర్లు కొనుగోలు చేశారు. వారికి ముందుగా తెలిసిన ప్రకారమే ఆ రోజు కూపర్ టైర్ కంపెనీ షేర్ విలువ అమాంతం 41 శాతం పెరిగింది. దీంతో వెంటనే వారు కొన్న షేర్లను అమ్మేశారు. ఇలా చేయడం ద్వారా వారికి ఒక మిలియన్ యూస్ డాలర్లు వచ్చాయి. అక్రమాలకు పాల్పడటం ద్వారా వారు ఈ సొమ్మును ఆర్జించారని అనంతరం గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ గతేడాది అక్టోబర్ నుంచి కొనసాగింది. తాజాగా గురువారం జ్యూరి సభ్యులు అమిత్ ను దోషిగా తేల్చారు. నవంబర్‌లో అహ్మద్ కు రెండేళ్ల శిక్షతో పాటు, 25వేల అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు. -
కమెడియన్‌కు 18 నెలల జైలు
వెస్ట్‌మినిస్టర్: వియత్నాంకు చెందిన ఫేమస్ కమెడియన్ మిన్ బియోకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ కోర్టు తీర్పువెలువరించింది. కాలిఫోర్నియాలో ఓ 16 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందకు గాను ఆయనకు ఈ మేరకు కోర్టు శిక్ష విధించింది. మిన్ బియో అసలుపేరు మిన్ క్వాంగ్ హాంగ్. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో సొంతంగా ధియెటర్ను కలిగివున్న మిన్ బియోకు.. స్టేజీ ఆర్టిస్ట్‌గానే కాక టీవీ షోలు, సినిమాల్లో మంచి కమెడియన్‌గా గుర్తింపు ఉంది. గత ఆగస్టులో మిన్.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో అంగీకరిచాడు. -
బాల నేరస్థులుగా గుర్తించి వదిలేశారు!
గుజరాత్ లో ముగ్గురిని చంపిన ఘటనలో మూడు సింహాలను అరెస్టు చేసిన ఘటనలో రెండింటిని బాల నేరస్తులుగా గుర్తించిన అధికారులు వాటిని ప్రొబేషన్ లో వదిలేసేందుకు నిర్ణయించారు. ముగ్గురు గ్రామస్థులను చంపిన కేసులో గుజరాత్ గిర్ నేషనల్ పార్కులోని మూడు సింహాలకు తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. వాటికి జీవిత ఖైదును విధించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాటిని అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండు చిన్న పిల్లలని తెలుసుకున్న అధికారులు జువైనల్స్ గా గుర్తించి వాటికి శిక్షను లేకుండా చేశారు. గుజరాత్ అభయారణ్యంలో ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాలకు జీవిత ఖైదు వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో రెండు బాల నేరస్తులని గుర్తించారు. ఓ మగ సింహం మనిషిని చంపి తినగా, మిగిలినవి అది మిగిల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని గమనించిన గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి సాసన్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో వదిలేయాలని నిశ్చయించింది. అయితే ఆరెండు సింహాలూ అడవిలో ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేట్లు చేసి వాటి ప్రవర్తనను కొంతకాలం పరిశీలిస్తామని ఫారెస్ట్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు. గత మూడు నెల్ల కాలంలోనే అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడికి దిగుతున్న సింహాలు ముగ్గురిని హతమార్చడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకొని, మొత్తం 17 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటిలో మూడింటిని దోషులుగా తేల్చినా, వాటిలో రెండు బాల నేరస్తులుగా గుర్తించి వాటిని అడవుల్లో వదిలేందుకు సిద్ధం చేశారు. -
ముగ్గురు కూతుర్లను పోర్న్ చిత్రాలకు అమ్మేశాడు
టెన్నిస్సే: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుర్లనే నీలి చిత్రాల నిర్మాతకు ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. దీంతో ఆ తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకి తీసుకెళ్లగా అతడికి జీవిత కారాగార శిక్ష పడింది. ఇదే కేసులో భాగస్వామ్యం ఉన్న తల్లికి కూడా ఇప్పటికే 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫిబ్రవరి 2011 నుంచి ఆగస్టు 2012 మధ్య కాలంలో పోర్న్ చిత్రాల్లో నటింప జేసేందుకు 63 ఏళ్ల తండ్రి తన 14, 14, 16 ఏళ్ల కూతుర్లను ఆ చిత్రాల నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారి ముగ్గురిని తీసుకెళ్లిన ఆ నిర్మాత వారందరిపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వారితో నీలి చిత్రాలు తీశాడు. చైల్డ్ పోర్న్ తీసే క్రమంలో భాగంగా వారిని పెద్ద మొత్తంలో చెల్లించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్న్ గ్రఫీ అనేది చాలా తీవ్రమైన నేరం అయిన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకు వెళ్లడించలేదు. -
మాల్యాపై తీర్పు మే 25 కి వాయిదా
హైదరాబాద్: పారిశ్రామికవేత్త విజయ మాల్యా గైర్హాజరు కావడంతో జీఎంఆర్, కింగ్ ఫిషర్ వివాదంలో దాఖలైన కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. జీఎంఆర్ దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసును విచారించిన మూడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు , తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా పరోక్షంలో తీర్పు వెల్లడించలేమని స్పష్టం చేసింది. జీఎంఆర్ యాజమాన్యం దాఖలు చేసిన చెల్లని చెక్కుల కేసులో మూడో ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్ జస్టిస్ కృష్ణారావు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మాల్యా హాజరుకాకుండా తీర్పు చెప్పలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి , తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. హైదరాబాద్‌లో జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు కింగ్‌ఫిషర్ సంస్థ రూ.25కోట్లకు పైగా బకాయి పడింది. రాజీ తర్వాత రూ.22కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ యాజమాన్యం అంగీకరించింది. ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్, జీఎంఆర్‌కు చెక్కులను అందజేసింది. బ్యాంకుల్లో తగిన డబ్బు నిల్వ లేకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ 17 కేసులు పెట్టింది. ఈ కేసులో నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం రూ.50లక్షల వంతున రెండు చెక్కులకు సంబంధించిన కేసులో మాల్యాను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే విచారణకు మాల్యా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బ్యాంకుల కన్సార్టియానికి 9వేల కోట్ల రూపాయలకు పైడా బకాయి పడ్డ విజయ్ మాల్యా లండన్ లో తలదాచుకున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించేందుకు జీఎమ్మార్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
అమెరికన్ విద్యార్థికి 15 ఏళ్ల బానిసత్వ శిక్ష
సియోల్: ఒట్టో వాంబియర్ అనే అమెరికన్ విద్యార్థికి ఉత్తర కొరియా సుప్రీంకోర్టు కఠిన శిక్షను విధించింది. పదిహేనేళ్లపాటు తమ దేశంలో ఊడిగం (కఠిన శ్రామికుడు)గా చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన మీడియా సంస్థ నిర్ధారించింది. వాంబియర్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. జనవరిలో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లాడు. ప్యాంగ్ యాంగ్ లోని ఓ హోటల్ లో దిగి తిరిగొచ్చే సమయంలో అతడు కొన్ని నినాదాలతో లిఖించిన వస్తువును దొంగించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టగా ఇది తమ దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరం అని పేర్కొంటూ 21 ఒట్టోకు 15 ఏళ్ల కఠిన బానిసత్వ శిక్షను వేసింది. ఒట్టో అమెరికాలోని ఒహియో ప్రాంతానికి చెందిన వాడు. ఈ విషయంపై అమెరికా ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. -
భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్యాంకు లావాదేవీలు, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో మోసానికి పాల్పడినందుకు అతడికి ఈ శిక్ష ఖరారైంది. భారత సంతతికి చెందిన అన్నామలై అన్నామలై(49)కు స్వామిజీ శ్రీ సెల్వం సిద్ధార్ అనే పేరు కూడా ఉంది. గార్జియాలోని ఓ హిందూ ఆలయానికి అతడు పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ కార్యాలకు ఉపయోగించకుండా భారీ మొత్తంలో అక్రమంగా ఆస్తులను పోగేసుకున్నాడని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని అతడిపై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. అతడు ట్యాక్స్‌లను కూడా ఎగ్గొట్టాడని తెలియడంతో న్యూయార్క్‌లోని ఓ కోర్టు ఆ స్వామిజీకి 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిసహా ఆరుగురికి జైలుశిక్ష
వరంగల్ మున్సిపల్ కోర్టు జడ్జి అనిత తీర్పు వరంగల్: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సహా ఆరుగురికి జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ వరంగల్ మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి టి.అనిత బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2012, ఏప్రిల్ 17న ఏపీ రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాక రామకృష్ణ, వరంగల్ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మోతె లింగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గోనె రాజిరెడ్డి, వీరగంధం నర్సింహారావు నేతృత్వంలో ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లిన వారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.రిజిస్టర్ చింపేశారు. ఉద్యోగుల విధులకు ఆటంకపరిచారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. పై ఆరుగురిపై నేరం రుజువుకావడంతో 6 నెలల జైలుశిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అనిత తీర్పు చెప్పారు. -
సంజయ్ దత్ జైలు శిక్ష తగ్గించే యోచనలో కేంద్రం
అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితం గడుపుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు శిక్ష తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సంజయ్‌కు శిక్ష తగ్గించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందే కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున సంజయ్‌కు ఊరట లభించే అవకాశముంది. ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ వద్ద కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో సంజయ్‌కు ఐదేళ్ల జైలు శిక్షపడిన సంగతి తెలిసిందే. గత మే 26 నుంచి పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా ఇటీవల పెరోల్‌పై బయటకువచ్చాడు. సంజయ్ కాలికి చికిత్స చేయించుకోవడానికి, కుటుంబంతో గడిపేందుకు సెలవు మంజూరు చేశారు.