అమెరికన్ విద్యార్థికి 15 ఏళ్ల బానిసత్వ శిక్ష | North Korea Court Sentences US Student To 15 Years Hard Labour: Report | Sakshi
Sakshi News home page

అమెరికన్ విద్యార్థికి 15 ఏళ్ల బానిసత్వ శిక్ష

Published Wed, Mar 16 2016 11:36 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

అమెరికన్ విద్యార్థికి 15 ఏళ్ల బానిసత్వ శిక్ష - Sakshi

అమెరికన్ విద్యార్థికి 15 ఏళ్ల బానిసత్వ శిక్ష

సియోల్: ఒట్టో వాంబియర్ అనే అమెరికన్ విద్యార్థికి ఉత్తర కొరియా సుప్రీంకోర్టు కఠిన శిక్షను విధించింది. పదిహేనేళ్లపాటు తమ దేశంలో ఊడిగం (కఠిన శ్రామికుడు)గా చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన మీడియా సంస్థ నిర్ధారించింది. వాంబియర్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. జనవరిలో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లాడు.

ప్యాంగ్ యాంగ్ లోని ఓ హోటల్ లో దిగి తిరిగొచ్చే సమయంలో అతడు కొన్ని నినాదాలతో లిఖించిన వస్తువును దొంగించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టగా ఇది తమ దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరం అని పేర్కొంటూ 21 ఒట్టోకు 15 ఏళ్ల కఠిన బానిసత్వ శిక్షను వేసింది. ఒట్టో అమెరికాలోని ఒహియో ప్రాంతానికి చెందిన వాడు. ఈ విషయంపై అమెరికా ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement