ఓట్టో వాంబియర్‌ చనిపోయాడు | US student Otto Warmbier released by North Korea dies; suffered brain damage during detention | Sakshi
Sakshi News home page

ఓట్టో వాంబియర్‌ చనిపోయాడు

Published Tue, Jun 20 2017 10:13 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

ఓట్టో వాంబియర్‌ చనిపోయాడు - Sakshi

ఓట్టో వాంబియర్‌ చనిపోయాడు

వాషింగ‍్టన్‌: గూఢచర్యం ఆరోపణలపై ఉత్తర కొరియా కఠిన శిక్ష విధించిన  అమెరికా విద్యార్థి  ఒట్టో వాంబియర్  ఫ్రెడరిక్ (22) కన్ను మూశాడు.  వారం క్రితం ఉత్తర కొరియా  విడుదల చేసిన ఒట్టో  మెదడు సంబంధ వ్యాధికి చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.    సిన్సినాటి మెడికల్ సెంటర్ లో చనిపోయినట్టు  తల్లి ఫ్రెడ్‌, తండ్రి  సిండీ  ప్రకటించారు.  

ఓట్టో మరణంపై అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్‌ ట్రంప్‌   సంతాపం తెలిపారు. ఉత్తర కొరియా  క్రూరత్వాన్ని  ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.  

నిర్బంధ సమయంలో  ఓట్టో  మెదడు డ్యామేజ్‌ అయింది.  దాదాపు ఒక సంవత్సరం నుంచి  కోమాలో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో తమకుమారుడిని   విడుదల చేయాల్సిందిగా  తల్లిదండ్రులుకోర్టును అభ్యర్థించారు. దీంతో  ఇటీవల  ఒట్టో వాంబియర్ అనే ఖైదీని నార్త్ కొరియా విడుదల చేసినట్లు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్ తెలిపారు. అయితే ఇంటికి చేరిన కొన్నిరోజుల్లోనే ఆయనప్రాణాలువిడవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.

కాగా అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ  ఒట్టోపై  చదువుతున్న  ఓట్టో పర్యాటకుడి ముసుగులో ఉత్తర కొరియాలో ప్రవేశించాడంటూ కేసులు నమోదు చేసింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నేరంలో సుప్రీం కోర్టు 2016 మార్చి 16న, 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష (బానిసత్వ శిక్ష) విధించింది. ఒట్టో అమెరికాలోని ఒహియో  ప్రాంతానికి చెందిన వాడు.ఒట్టో 18 నెలలపాటు క్రూరంగా, దారుణంగా తనకుమారుడిని శిక్షించారని తండ్రి  గతవారం విడుదల సందర్భంగా విలేకరుల సమావేశంలో  ఆరోపించినసంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement