భారీ మోసం.. జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌ | Two Indian-Americans sentenced for credit card fraud in US | Sakshi
Sakshi News home page

భారీ మోసం.. జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌

Published Tue, Mar 28 2017 10:00 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

భారీ మోసం.. జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌ - Sakshi

భారీ మోసం.. జైలుకు ఇండియన్‌ అమెరికన్స్‌

వాషింగ్టన్‌: పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష పడింది. దాదాపు 200 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ కార్డు మోసానికి దిగిన విజయ్‌ వర్మ(49), తర్సీం లాల్‌(78) అనే ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదువేల డాలర్లను జరిమానా విధించింది. న్యూజెర్సీలో వీరిద్దరు ఓ జ్యూయెలరీ స్టోర్‌ యజమానులుగా ఉన్నారు. 2013లో ఓ పథకం పేరిట దాదాపు 7000 తప్పుడు చిరునామాలు, అడ్రస్‌ ప్రూఫ్‌లు పెట్టి దాదాపు వేలల్లో క్రెడిట్‌ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డారు.

ఆ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి తమ స్టోర్‌లోనే స్వైపింగ్‌ చేసి క్రెడిట్‌ లిమిట్‌ మొత్తం తమ ఖాతాల్లోకి వచ్చేలా చూసుకున్నారు. ఇలా 200 మిలియన్‌ డాలర్లు వారి ఖాతాకు జమ అయింది. అయితే, ఆ తర్వాత ఆ అప్పును చెల్లించేందుకు కార్డు దారులు ముందుకు రాకపోవడంతో దర్యాప్తు చేయగా అసలు బండారం బయటపడింది. వారే క్రెడిట్‌ కార్డులు సృష్టించి వారే ఈ మోసానికి దిగినట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించగా మొత్తం 14 నెలల జైలు శిక్షతోపాటు 12 నెలలపాటు ఇంట్లోనే ఉండిపోయేలా శిక్ష వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement