వరంగల్ మున్సిపల్ కోర్టు జడ్జి అనిత తీర్పు
వరంగల్: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సహా ఆరుగురికి జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ వరంగల్ మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి టి.అనిత బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 2012, ఏప్రిల్ 17న ఏపీ రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాక రామకృష్ణ, వరంగల్ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మోతె లింగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గోనె రాజిరెడ్డి, వీరగంధం నర్సింహారావు నేతృత్వంలో ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లిన వారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.రిజిస్టర్ చింపేశారు. ఉద్యోగుల విధులకు ఆటంకపరిచారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఇంతేజార్‌గంజ్ పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. పై ఆరుగురిపై నేరం రుజువుకావడంతో 6 నెలల జైలుశిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అనిత తీర్పు చెప్పారు.
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిసహా ఆరుగురికి జైలుశిక్ష
Published Thu, Oct 30 2014 1:59 AM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement
Advertisement