Indian priest
-
యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!
సనా: యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం ‘గుడ్ ఫ్రైడే’ రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్‌బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు. మార్చి 4వ తేదీన ఏడెన్‌లో మదర్ థెరిస్సా క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలోకి సాయుధులైన నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు జొరబడి ఫాదర్ టామ్ (థామస్)ను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు నన్స్, ఇద్దరు యెమెన్ స్టాఫ్, ఎనిమిది మంది వృద్ధులు, ఓ గార్డు మరణించారు. కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన భారతీయ ఫాదర్ టామ్‌ను గుడ్‌ఫ్రై రోజున శిలువేసి చంపేస్తామని కూడా టెర్రరిస్టులు ముందుగానే హెచ్చరించారట. -
అతడిని శిలువ వేశారేమో..!
- ఇండియన్ ప్రీస్ట్ ను కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ - గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేసి ఉంటారని అనుమానం ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన ఇండియన్ ప్రీస్ట్ ను గుడ్ ఫ్రైడే నాడు.. శిలువ వేసి ఉంటారనే ఆనుమానాలు బలపడుతున్నాయి. యెమెన్ లో మార్చి 4న ఒక రిటైర్డ్ మెంట్ హౌస్ పై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఫాదర్ టామ్ ఉజునలిల్ ను ఎత్తుకెళ్లారని భావిస్తున్నారు. అతి కిరాతకంగా.. దాడిచేసిన తీవ్రవాదులు.. ఓ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ పై దాడి చేసి.. నలుగురు క్రైస్తవ సన్యాసినులతో సహా.. 16 మందిని చంపేశారు. దాడి తర్వాత అదే హొం లో బస చేస్తున్న ఫాదర్ టామ్ జాడతెలియడం లేదు. గత ఆదివారం ఓ క్రైస్తవ సన్యాసిని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫాదర్ టామ్ పై జరగనున్న హింసకు సంబంధించి ఒక మెసేజీ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రకారం గుడ్ ఫ్రైడే నాడు ఫాదర్ ను శిలువ వేసే అవకాశం ఉనట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు దాడికి ముందు ముగ్గురు ఇథియోపియన్ క్రిస్టియన్ యువకులు హోమ్ లోకి హడావుడిగా వచ్చి.. ఐఎస్ఐఎస్ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చారని. తర్వాత కొద్ది సేపటికే.. మారణ హోమం జరిగిందని. అప్పుడే ఫాదర్ ని కిడ్నాప్ చేశారని ఓ సన్యాసిని చేతిరాతతో ఉన్న నోట్ హోమ్ లో లభించిందని పేర్కొంటూ అలెటియన్ అనే క్రిస్టియన్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. భారత్ లోని బెంగళూరు నగరంలోని డాన్ బాస్కోకి చెందిన సలేషియన్ సిస్టర్స్ సభ్యులు మాట్లాడుతూ.. ఫాదర్ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. హోమ్ పై దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే యెమెన్ అధికారులు మాత్రం ఇది ఐఎస్ఐఎస్ దుశ్చర్యే అని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అల్ ఖైదా కు కూడా పట్టు ఉండంతో.. వారు చేసి ఉంటారని కొంత మంది విస్తున్నారు. -
భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్యాంకు లావాదేవీలు, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో మోసానికి పాల్పడినందుకు అతడికి ఈ శిక్ష ఖరారైంది. భారత సంతతికి చెందిన అన్నామలై అన్నామలై(49)కు స్వామిజీ శ్రీ సెల్వం సిద్ధార్ అనే పేరు కూడా ఉంది. గార్జియాలోని ఓ హిందూ ఆలయానికి అతడు పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ కార్యాలకు ఉపయోగించకుండా భారీ మొత్తంలో అక్రమంగా ఆస్తులను పోగేసుకున్నాడని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని అతడిపై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. అతడు ట్యాక్స్‌లను కూడా ఎగ్గొట్టాడని తెలియడంతో న్యూయార్క్‌లోని ఓ కోర్టు ఆ స్వామిజీకి 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
తాలిబన్ చెరనుంచి బయటపడ్డ ప్రేమ్ కుమార్
ఎట్టకేలకు అఫ్గనిస్థాన్ తాలిబన్ చెరనుంచి ప్రముఖ భారతీయ క్రైస్తవ మతాచార్యుడు అలెక్సీస్ ప్రేమ్ కుమార్ బయటపడ్డాడు. గత ఎనిమిది నెలలుగా వారి బందీలో ఉన్న అలెక్సీస్ ప్రేమ్ కుమార్‌ను వదిలేశారు. క్రైస్తవులను ఎలాంటి సమస్యల నుంచైనా రక్షించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వారంలోపే అలెక్స్ బయటపడటం గమనార్హం. తమిళనాడులోని శివగంగా జిల్లాకు చెందిన ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ అఫ్గనిస్ధాన్లో అంతర్జాతీయ జెస్యూట్ నిరాశ్రయుల స్వచ్ఛంద సేవా సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనను గత జూన్ 2, 2014న తాలిబన్లు బందీగా పట్టుకెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆయన తన కుటుంబంతో సహా వచ్చి మోదీని కలువనున్నారు. మోదీ కూడా ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ జేశారు. -
ఫాదర్ కొప్పలను అమెరికా బహిష్కరించే అవకాశం
వాషింగ్టన్(ఐఏఎన్ఎస్): అమెరికాలోని మిన్నెసోటాలో ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రోమన్ కేథలిక్ నెల్లూరు డయోసీస్(క్రై స్తవ జిల్లా)కు చెందిన ఫాదర్ లియో చార్లెస్ కొప్పల (47) అంగీకరించాడు. ఇందుకు అతని ప్రవర్తనపై 25 ఏళ్లపాటు నిఘాకు ఆదేశిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కొప్పలను అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన్ను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దక్షిణ మిన్నెసోటాలోని వినోనా డైయోసీస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను కోర్టు తీర్పు నేపథ్యంలో శాశ్వతంగా పదవి నుంచి తప్పించారు. 2013 జూన్ 8న ఓ వద్ధురాలి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి విందుకు వెళ్లిన కొప్పల, ఆమె మనవరాలిపై వికత చేష్టలకు పాల్పడ్డాడు. దీనిపై వద్ధురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టులో కొప్పల తన నేరాన్ని అంగీకరించారు.