
ఐడీబీఐ ఉద్యోగుల సమ్మె విజయవంతం: యూనియన్లు
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు నిరసనగా సోమవారం చేపట్టిన సమ్మె విజయవంతమయ్యిందని యునెటైడ్ ఫోరమ్
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు నిరసనగా సోమవారం చేపట్టిన సమ్మె విజయవంతమయ్యిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్(యూఎఫ్‌ఐఓఈ), యునెటైడ్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ఐడీబీఐ బ్యాంక్ యూనియన్స్ (యూపీఐబీయూ) ప్రకటించాయి. 85% అధికారులు, 100% మంది సాధారణ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపాయి. బ్యాంక్‌కు చెందిన కార్యాలయాలు, శాఖలు పనిచేయలేదని పేర్కొన్నాయి. సమ్మెను మరో మూడు రోజులు కొనసాగిస్తామని యూపీఐబీయూ ప్రకటించింది. కాగా ఫ్రంట్ ఆఫీస్ సర్వీసులు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు సహా చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, ఆర్‌టీజీస్/నెఫ్ట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సర్వీసులు, ట్రెజరీ కార్యకలాపాలన్నీ యథావిథిగా కొనసాగాయని ఐడీబీఐ బ్యాంక్ మేనేజ్‌మెంట్ తెలిపింది.