
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ క్యూ2 ఫలితాల్లో నిరాశపర్చింది. బ్యాండ్ లోన్ల బెడదతో వరుసగ నాల‍్గవ క్వార్ట్‌లో కూడా నీరస పడింది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఏడాది రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో రూ.198 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది(2016-17) క్యూ2లో రూ. 55.5 కోట్ల నికర లాభం ఆర్జించింది.
తాజా సమీక్షలో ప్రధానంగా ప్రొవిజన్లు 141 శాతంపైగా ఎగసి రూ. 3256 కోట్లను తాకడం ప్రభావం చూపింది. అసెట్ క్వాలిటీకూడా మరింత దిగజారింది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్.పి.ఎ.) 24.98 శాతానికి పెరిగాయి. గత త్రైమాసికంలో 24.11 శాతంగా నిలిచింది. ఈ త్రైమాసికానికి అడ్వాన్సులు 16.05 శాతం తగ్గి ఒక సంవత్సరం క్రితం నుంచి రూ .1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు 19.24 శాతం క్షీణించి రూ .2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫలితాలు నిరాశ పరచడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లో వెల్లువెత్తిన అమ్మకాలతో 5 శాతం క్షీణించి రూ. 62 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment