మొండి బకాయిల బండ | Listed banks saw 38% rise in bad loans for 6-months ending Sep 2013 | Sakshi
Sakshi News home page

మొండి బకాయిల బండ

Published Fri, Nov 15 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

మొండి బకాయిల బండ

మొండి బకాయిల బండ

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 40 లిస్టెడ్ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) ఏకంగా 38 శాతం ఎగిసి రూ. 1,28,533 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మొత్తం రూ. 93,109 కోట్లు. కాగా, ప్రతి త్రైమాసికానికి పరిస్థితులు క్షీణిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఇది రూ. 1.5 లక్షల కోట్ల మార్కును దాటేయగలదని అంచనా. ఎన్‌పీఏసోర్స్‌డాట్‌కామ్ అనే పోర్టల్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
 
 దీని ప్రకారం 40 లిస్టెడ్ బ్యాంకు ల్లో 14 బ్యాంకుల నికర ఎన్‌పీఏలు 50% పైగా ఎగిశాయి. అయితే, మొత్తం ఎన్‌పీఏల్లో టాప్ 10 బ్యాంకుల వాటా 70% నుంచి 67.8 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి స్థూల ఎన్‌పీఏలు మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 27% ఎగిసి రూ. 2,29,007 కోట్లకు పెరిగినట్లు పోర్టల్ సీఎండీ దేవేంద్ర జైన్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఇది రూ.1,79,891 కోట్లు. 2011 సెప్టెంబర్ నుంచి చూస్తే లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రెట్టింపు కాగా నికర ఎన్‌పీఏలు మాత్రం 140% పెరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement